Acసినిమా గ్లామర్ ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. నటనపై ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలలో దూసుకుపోతుంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మధ్య పెరిగిన ఆమె.. జర్నలిజం చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఓ ఛానల్లో రిపోర్టర్ గా జాబ్ చేసింది. కానీ నటనపై ఆసక్తి ఉన్న ఆమె.. న్యూస్ రూమ్ నుంచి చలనచిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది.
ఇప్పుడు సొంతంగా ఐల్యాండ్ , కోట్ల ఆస్తి ఉన్న హీరోయిన్ ఆమె. ఆ హీరోయిన్ మరెవరో కాదండి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. జాక్వెలిన్ తండ్రి శ్రీలంకకు చెందినవారు. తల్లి మలేషియా. ఆమె బహ్రెయిన్‌లోని మనామాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే విభిన్న సంస్కృతి, సంప్రదాయల మధ్య పెరిగింది. సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి శ్రీలంకకు తిరిగి వచ్చింది.
అక్కడ ఆమె టెలివిజన్ రిపోర్టర్‌గా, లంక బిజినెస్ రిపోర్ట్ షోకు యాంకర్‌గా పనిచేసింది. 2006లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2009లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన అలాడిన్ అనే ఫాంటసీ డ్రామాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఐఫా స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.
2011లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మర్డర్ 2 మూవీతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌ఫుల్ 2 , రేస్ 2 , కిక్ వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది. జాక్వెలిన్ ఎక్కువగా స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అలాగే శ్రీలంకలో సొంతంగా ద్వీపం కొనుగోలు చేసిందట. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ముంబైలో జాక్వెలిన్‌కు 5 బిహెచ్కె అపార్ట్మెంట్ కూడా ఉందని టాక్. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ బిగినింగ్ లో ఓ టీవీ ఛానెల్లో యాంకర్‌గా చేసింది. హౌస్‌ఫుల్, మర్డర్ 2, కిక్ , రేస్ 2తో సహా 35కి పైగా చిత్రాలలో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్ ఫొటోలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.




