Pakistan Egg Price: నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా కోడిగుడ్డు ధర కూడా ఆకాశాన్ని తాకింది. అయితే అక్కడ మాత్రం ఒక గుడ్డు ధర ఏకంగా 30 రూపాయలపైనే పలుకుతోంది. ఇంత ధర ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇది మన దేశంలో కాదు. పాకిస్తాన్‌లో. మిడిల్ క్లాస్ ఇళ్లల్లో నాన్ వెజ్‌కి ప్రత్యామ్నాయంగా ఉన్న గుడ్డు ధర చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కోళ్ల ఫారాల దగ్గరే రికార్డు స్థాయికి ధర చేరగా.. ఇక బయట మార్కెట్లలో ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సడెన్‌గా పెరిగిన ఈ కోడి గుడ్డు రేటుతో అక్కడి సామాన్యుడు సతమతమవుతున్నాడు.
పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక డజను గుడ్ల ధర దాదాపు రూ. 360 నుంచి రూ. 400 (పాకిస్తాన్ రూపాయలు) వరకు ఉంది. అంటే ఒక్కో కోడిగుడ్డు ధర సుమారు రూ. 30 నుండి రూ. 32 పడుతోంది. ప్రాంతాన్ని బట్టి, మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. అయితే ఈ గుడ్డు ధర మన భారత కరెన్సీలు చూసుకుంటే ఒక్క గుడ్డు ధర 9.04 రూపాయలు పడుతుంది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
ఇవి కూడా చదవండి
కోడి గుడ్లను కొనాలంటేనే పాకిస్థానీలు వణికిపోతున్నారు. పౌల్ట్రీ ఫామ్‌లలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని పాక్ వ్యాపార వర్గాలు తెలిపాయి. దీంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే..తెలంగాణలో ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు రిటైల్ ధర సుమారు రూ. 7 నుండి రూ. 8.50 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లో వంద గుడ్ల ధర దాదాపు రూ. 650 నుండి రూ. 695 మధ్య ఉంది. ఇక ట్రే ధర (30 గుడ్లు) ధర సుమారు రూ. 175 – రూ. 210 ఉంది.
ఇది కూడా చదవండి: Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి