
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం ఓ షూంటింగ్లో ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఆయన ప్రస్తుతం డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆద్వర్యంలో చికిత్స పొందుతున్నారని.. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.