Headlines

SIR: ఎస్ఐఆర్‌ ప్రక్రియలో మీ ఓటు గల్లంతయ్యిందా..? నో టెన్షన్.. ఈ ఫారం పూర్తి చేస్తే మీ ఓటు మళ్లీ వచ్చేస్తుంది..

SIR: ఎస్ఐఆర్‌ ప్రక్రియలో మీ ఓటు గల్లంతయ్యిందా..? నో టెన్షన్.. ఈ ఫారం పూర్తి చేస్తే మీ ఓటు మళ్లీ వచ్చేస్తుంది..


కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) నిర్వహించిన విషయం తెలిసిందే. జులై 24వ తేదీతో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియలో కొంతమంది ఓటర్లను జాబితా నుంచి ఈసీ తొలగించనుందని తెలుస్తోంది. దాదాపు 44.71 లక్షల ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చినట్లు సమాచారం. వేరే అడ్రస్‌లో నివసిస్తుండటం, మరణించడం, రెండు కార్డులు కలిగి ఉండటం, ఓటర్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వీటిని తొలగించనుంది. జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ ఓటర్ల పేర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే మీ పేరు లేకపోతే ఏం చేయాలి..? కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

మీ పేరు లేకపోతే ఏం చేయాలి..?

మీ పేరు లేకుంటే ఆగస్టు 30లోపు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త ఓటర్‌గా నమోదు అయ్యేందుకు ఫారం 6ను ఈసీ ప్రవేశపెట్టింది. ఈ ఫారం ఆన్‌లైన్‌లో నింపవచ్చు. మీరు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి ఓటర్ల జాబితాలో చేస్తారు. అలాగే గుర్తింపు ధృవీకరణ పత్రం లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు ధృవీకరించి ఓటర్ల లిస్టులో మిమ్మల్ని చేరుస్తారు. కొత్త ఓటర్ ఐడీ జారీ చేస్తారు.

ఎస్ఐఆర్‌లో మీ పేరు ఉందా..? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి..?

ఎస్ఐఆర్‌లో మీ పేరు ఉందా.. లేదా అనేది పలు మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ విధానంలో తెలుసుకోవాలంటే.. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. వెంటనే మీకు ఈసీ నుంచి ఒక మెస్సేజ్ వస్తుంది. అందులో మీ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ సెంటర్, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, పేరు లాంటి వివరాలు వస్తాయి. ఈ వివరాలు మీకు వస్తే ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదైనట్లు లెక్క. ఒకవేళ మీకు వివరాలు అందకపోతే ఎస్ఐఆర్‌లో నమోదు కానట్లు అర్థం చేసుకోవాలి. వెంటనే బూత్ లెవల్ ఆఫీసర్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎమ్యునరేషన్ ఫారాలు అందించారు. వాటిని పూర్తి చేసి తిరిగి అందించాలి. అందించకపోతే ఓటర్ల జాబితాలో మీ పేరు తొలగిస్తారు. మళ్లీ ఫారం 6 ద్వారా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *