Headlines

IND vs ZIM: ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌తో చరిత్ర తిరగరాసిన బుడ్డోడు.. ఇక చూపంతా 2వ మ్యాచ్‌పైనే..!

IND vs ZIM: ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌తో చరిత్ర తిరగరాసిన బుడ్డోడు.. ఇక చూపంతా 2వ మ్యాచ్‌పైనే..!


Vaibhav Sooryavanshi Records: భారత క్రికెట్ వండర్ కిడ్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన ఆల్‌రౌండ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేశాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

ప్రపంచ రికార్డు నమోదు.. కుశాల్ మల్లా రికార్డ్ కట్..!

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో టీమిండియా యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బౌండరీల సునామీ సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ టీ20లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర పుటలకెక్కాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా (15 ఏళ్ల 340 రోజులు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు. జిబ్రాల్టర్‌కు చెందిన లూయిస్ బ్రూస్ టీ20లలో నెలకొల్పిన రికార్డును కూడా ఈ బీహార్ కుర్రాడు తన సంచలన ఇన్నింగ్స్‌తో అధిగమించడం విశేషం.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

ఇవి కూడా చదవండి



సచిన్, రోహిత్ శర్మ రికార్డులు బద్దలు..!

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మల ఆల్ టైమ్ రికార్డులను వైభవ్ తుడిచేశాడు. 1989లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 213 రోజులు) సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత హాఫ్ సెంచరీ రికార్డును వైభవ్ అధిగమించాడు.

అలాగే, 2007 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ (20 ఏళ్ల 143 రోజులు) నెలకొల్పిన వేగవంతమైన యంగెస్ట్ ఇండియన్ ఫిఫ్టీ రికార్డును సైతం బద్దలు కొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేశాడు.

18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. భారత్ తరఫున ఫాస్టెస్ట్!

జింబాబ్వే విసిరిన 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు విరుచుకుపడ్డాడు. బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ ఎన్గరవ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన యంగ్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

2026లో అత్యధిక సిక్సర్లు సాధించిన వీరుడు..!

ఈ మైలురాయితో పాటు 2026 క్యాలెండర్ ఇయర్ లో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా వైభవ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనే ఏకంగా 72 సిక్సర్లు బాది 776 పరుగులు సాధించిన ఈ యంగ్ హిట్టర్, అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగిస్తూ మొత్తం 81 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *