Headlines

పాన్ ఇండియా సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా..? స్టార్‌ హీరోలు లెక్క తప్పుతున్నారా?

పాన్ ఇండియా సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా..? స్టార్‌ హీరోలు లెక్క తప్పుతున్నారా?


ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. ఏడు నెలల వాయిదా తర్వాత ‘జన నాయగన్‌’ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎన్నో వాయిదాల తర్వాత యష్ ‘టాక్సిక్’ ఆగస్టు 26కి డేట్ లాక్ చేసుకుంది. మిగతా టాప్ హీరోల ప్రాజెక్టులు ఎప్పుడొస్తాయో తెలియక డిస్ట్రిబ్యూటర్లతో పాటు అభిమానులు కూడా డైలమాలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే దానిపై మేకర్స్ నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్టార్స్‌గా మారిన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ స్టార్ హీరోల సినిమాలు పదే పదే వాయిదాలు పడుతున్నాయి. చెప్పిన సమయానికి ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తాయనే భరోసా మేకర్స్ ఇవ్వలేకపోతుండటంతో ఇండస్ట్రీలో సందడే లేకుండా పోయింది. వారణాసి కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నారు మహేష్‌. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన డ్రాగన్‌ నెక్ట్స్ ఇయర్‌కు వాయిదా పడింది. రామ్ చరణ్ పెద్ది కూడా ఎన్నో వాయిదాల తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇలా స్టార్ హీరోలంతా ఏళ్లకేళ్లు టైమ్ తీసుకోవటంతో వెండితెర మీద ఆ గ్యాప్‌ స్పష్టంగా కనిపిస్తోంది. లైనప్‌లో అరడజను సినిమాలు పెట్టి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్, అటు పాలిటిక్స్ ఇటు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కల్యాణ్‌ పరిస్థితీ ఇలాగే ఉంది. వీళ్లు చేస్తున్న భారీ సినిమాలు చెప్పిన డేట్‌కు రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పుడు ఉన్న స్పీడ్, రిలీజ్ డేట్స్ దగ్గరపడేసరికి కనిపించటం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *