Headlines

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదా..? ఆర్బీఐ బిగ్ రిలీఫ్.. అప్పటివరకు మీరు సేఫ్..

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదా..? ఆర్బీఐ బిగ్ రిలీఫ్.. అప్పటివరకు మీరు సేఫ్..


Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదా..? ఆర్బీఐ బిగ్ రిలీఫ్.. అప్పటివరకు మీరు సేఫ్..

బంగారం ధరలు పెరగడంతో ఎక్కువమంది గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గోల్డ్ ధరలు పెరగడంతో వాటిని తాకట్టు పెట్టి పొందే లోన్ లిమిట్ ఎక్కువగా లభిస్తోంది. దీంతో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు తమ ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు తాకట్టు పెట్టిన బంగారానికి బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. అయితే బ్యాంకులు వెంటనే ఈ పని చేయవు. కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఇది ఉంటుంది. చాలా బ్యాంకులు వేలం వేయకుండా అప్పును వసూలు చేయడానికి ముందుగా ప్రయత్నిస్తాయి. చాలాకాలం పాటు వాయిదాలు చెల్లించనప్పుడు మాత్రమే వేలం నిర్వహించే అవకాశముంటుంది.

90 రోజుల గడువు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. బ్యాంకులు ఒక నిర్దిష్ట ప్రాసెస్‌ను అనుసరించిన తర్వాత మాత్రమే దానిని వేలం వేయగలవు. ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షించే ఒక పారదర్శక ప్రక్రియ. దీంతో రుణం తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వడ్డీ లేదా వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే.. మీ ఆభరణాలకు వెంటనే వేలం నిర్వహించరు. బ్యాంకులు కొంత గడువును రుణ గ్రహీతకు అందిస్తాయి. వరుసగా 90 రోజుల పాటు వాయిదాలు లేదా వడ్డీ చెల్లించడంలో విఫలమైతే.. మీ రుణ ఖాతా ‘నిరర్థక ఆస్తి’ ప్రకటిస్తారు. ఆ తర్వాత మాత్రమే వేలం ప్రక్రియలు ప్రారంభమవుతాయి. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, అకస్మాత్తుగా వేలం నిర్వహించే అవకాశం ఉండదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

వేలానికి ముందు బ్యాంకులు ఏం చేస్తాయి..?

మీ బంగారు ఆభరణాలను వేలం వేయడానికి ముందు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అనేక చర్యలు తీసుకుంటాయి. మొదట మీకు ఫోన్ ద్వారా రిమైండర్ కాల్స్ వస్తాయి. ఆ తర్వాత బ్యాంక్ మీకు లేఖలు లేదా ఇమెయిల్‌ల్స్ ద్వారా నోటీసులు పంపుతుంది. వేలానికి వెళ్లే ముందు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీకు ఒక నెల గడువు ఇస్తుంది. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఒక నోటీసు పంపిస్తారు. ఈ నోటీసులో వేలం తేదీ, సమయం, వేదిక స్పష్టంగా పొందుపరుస్తారు. ఇది పారదర్శకమైన ప్రక్రియ కాబట్టి మీకు తెలియకుండా మీ బంగారం వేలం నిర్వహించే అవకాశమే లేదు.
ఇలాంటి సమయంలో మీరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి మీ పరిస్థితిని వివరించవచ్చు. అప్పుడు EMIని రెన్యూవల్ చేయడం, రుణ కాలపరిమితిని పొడిగించడం లేదా పాక్షిక చెల్లింపులు చేయడం వంటి ఆప్షన్ అందించవచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు ‘టాప్-అప్’ రుణాలను అందిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *