ఏవీఎస్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సినీరంగంలో నటుడిగా, సహ్య నటుడిగా తనదైన ముద్ర వేశాడు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్, మేనరిజం కారణంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. దాదాపు 500ల చిత్రాలలో నటించిన ఆయన.. 2013లో తుదిశ్వాస విడిచారు. కానీ మీకు తెలుసా.. ? ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే ఏవీఎస్.. చివరి రోజుల్లో మాత్రం ఎంత నరకం అనుభవించారు. కూతురు కాలేయం ఇచ్చి బతికించుకున్నప్పటికీ ఫలితం లేకుంపోయింది. ఇటీవల ఆ కూతురు అల్లుు శాంతి చింటూ ఇద్దరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్యం, చివరి రోజుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన తండ్రి 57 ఏళ్ల వయసులో మరణించారని.. అలాగే తల్లి కూడా 62 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచారని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
నిరంతరం షూటింగ్ లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి ఆరోగ్యం పాడైందని.. కానీ బయటివారు మాత్రం తాగడం వల్లే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని అంటుంటారని చెప్పుకొచ్చింది. తన తండ్రి కనీసం ఎగ్ కేక్ కూడా ముట్టుకోరని.. సోడా కూడా పెద్దగా తాగేవారు కాదని అన్నారు. కానీ 2008లో తన తండ్రి కాలేయం పాడైపోయిందని.. రక్తపు వాంతులు చేసుకున్నాడని అన్నరు. డాక్టర్స్ ఆయనను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలని అన్నారు. దీంతో కూతురు కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యింది. అప్పటికే ఆమె కాస్త లావుగా ఉండడంతో తనది సెట్ కాదని డాక్టర్స్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. దాత దొరికాలంటే ఏడాది సమయం పడుతుందని చెప్పారు. అప్పటికే తన తండ్రి జ్ఞాపకశక్తి కోల్పోయారని.. తన తల్లిని కూడా గుర్తుపట్టలేదని.. కేవలం తన పేరు మాత్రమే గుర్తుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
20 రోజుల్లోనే కాలేయం ఆపరేషన్ డాక్టర్స్ చెప్పారు. దీంతో దాతల కోసం వెతికే టైం లేకపోవడంతో తానే తన తండ్రికి కాలేయం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయని తన తండ్రి భయపడ్డానని.. ఆ సమయంలో తన భర్తే దగ్గరుండి ఒప్పించారని అన్నారు. తాను 60 శాతం కాలేయం దానం చేశానని.. సర్జరీ తర్వాత కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. కానీ రెండో నెలకే షూటింగ్స్ అంటూ బిజీ అయ్యారు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు తన తండ్రి పరిస్థితి విషమించి తన చేతులోనే రక్తం కక్కుకుని చనిపోయాడని భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 65 లక్షలు ఖర్చు చేసి తన తండ్రికి ఆపరేషన్ చేయించుకున్నాని చెబుతూ ఎమోషనల్ అయ్యారు ఏవీఎస్ కూతురు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..