Headlines

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులు జాగ్రత్త!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులు జాగ్రత్త!


అటు ఏపీ, ఇటు తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖలు కీలక సూచనలు చేశాయి. నైతురి రుతుపవణాల కారణంగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు , మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని.. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వెల్లడించింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం ప్రకారం.. గురువారం రాష్ట్రంలోని హైదరాబాద్‌ సహా 9 జిల్లాల్లో.. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో 64.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక ఏపీ విపత్తు నిర్వహన సంస్థ ప్రకారం.. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామారజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది.

ప్రజలకు సూచనలు: ఈ భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేశాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించి. అలాగే తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని.. పొలాలకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *