Headlines

ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!

ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!


ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే చాలామంది రెస్ట్ తీసుకుంటారు.. లేదా చుట్టూ ఉన్న దృశ్యాలను చూస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం బైక్‌పై వెళ్తూనే రెడ్ సిగ్నల్ పడగానే ల్యాప్‌టాప్ తీసి పని చేయడం ప్రారంభించాడు. కార్పొరేట్ వర్క్ కల్చర్, వృత్తిగత జీవిత ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో అద్దం పట్టేలా ఉన్న ఈ దృశ్యాన్ని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న దృశ్యాల ప్రకారం.. ఒక యువకుడు తన బైక్‌పై బిజీ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నాడు. ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఎరుపు రంగు సిగ్నల్ పడటంతో బైక్‌ను ఆపాడు. సిగ్నల్ పడిన కొద్ది సెకన్లలోనే తన బ్యాగ్ నుంచి ల్యాప్‌టాప్‌ను బయటకు తీసి, బైక్ హ్యాండిల్‌పైనే ఉంచి అత్యంత వేగంగా టైప్ చేయడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి



గ్రీన్ సిగ్నల్ పడే లోపే తన ఆఫీస్ పనికి సంబంధించిన ముఖ్యమైన మెయిల్ లేదా మెసేజ్‌ను పూర్తి చేయాలనే ఆరాటంలో అతడు కనిపించాడు. వెనుక ఉన్న మరొక వాహనదారుడు ఈ దృశ్యాన్ని తన ఫోన్ కెమెరాలో బంధించి నెట్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ యువకుడి డెడికేషన్‌ను, సమయ పాలనను ప్రశంసించారు. ఆఫీస్ డెడ్‌లైన్స్ అందుకోవడానికి అతడు పడుతున్న శ్రమను మెచ్చుకున్నారు. ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం కార్పొరేట్ కంపెనీల ధోరణిని తీవ్రంగా నిరసించారు. ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి, చివరకు రోడ్డుపై ప్రయాణించే సమయంలో కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్డుపై ఇలా దృష్టి మరల్చి పనిచేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమైంది.

సాంకేతికత ఎంత పెరిగినా, ఉద్యోగాల్లో వేగం ఎంత పెరిగినా.. ప్రాణాలకు ముప్పు తెచ్చేలా, మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా ఉన్న ఈ తరహా వర్క్ కల్చర్ మారాల్సిన అవసరం ఉందనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *