Headlines

Bigg Boss Telugu: ‘ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..’ పిచ్చెక్కిస్తున్న రియల్ టైం డాటా..

Bigg Boss Telugu: ‘ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..’ పిచ్చెక్కిస్తున్న రియల్ టైం డాటా..


బిగ్ బాస్.! ఫారెన్ నుంచి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఎంటర్‌టైన్మెంట్ కాన్పెప్ట్.. మన దగ్గర సూపర్ డూపర్ హిట్టైంది. పాన్ ఇండియా భాషల్లో.. ఇండివిడ్జూవల్‌గా టాప్‌ రేటింగ్ తెచ్చుకుంటోంది. దీంతో ఈ షోను డిజైన్ చేస్తున్న మేకర్స్ అండ్ … స్ట్రీమింగ్ చేస్తున్న హాట్ స్టార్.. ఇప్పుడో క్రేజీ డెసీషన్‌ను తీసుకుంది. అన్ని లాంగ్వేజెస్‌లోని బిగ్ బాస్ సీజన్లను ఓకే టైంకు లాంచ్‌ చేసేలా ప్లాన్ చేసింది. ఇక ఈ మెగా లాంచ్ సందర్భంగా, జియోస్టార్ ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే పేరుతో ఒక ప్రత్యేక టేబుల్ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసింది. బిగ్ బాస్ 20 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పొందుపరచడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక అకార్డింగ్ టూ ఆ బుక్… 2025 నాటికి ఆరు భాషల్లో.. బిగ్ బాస్ రికార్డు స్థాయిలో 500 మిలియన్ల ప్రేక్షకులను సంపాదించుకుంది. ఒక్క సౌత్ స్టేట్స్‌లోనే 3 కోట్లకు పైగా ప్రజలు బిగ్ బాస్‌ను చూస్తారట. ఇక్కడ ప్రతి 10 మంది టీవీ వీక్షకుల్లో 8 మంది బిగ్ బాస్‌ను చూస్తారట. ఇది సౌత్ ఇండియాలోని ఇతర అన్ని రియాలిటీ షోల సంయుక్త వీక్షకుల సంఖ్య కంటే 3.5 రెట్లు ఎక్కువ. జియోహాట్‌స్టార్‌లో ప్రతి 10 మంది వీక్షకులలో 6 మంది 24 గంటల లైవ్ ఫీడ్‌ను చూస్తున్నారు. 2025 సీజన్‌లో 1.7 బిలియన్ల సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌లు, 30 మిలియన్లకు పైగా యూజర్-జనరేటెడ్ మీమ్స్ ఉన్నాయంటూ… జియోస్టార్ ఒక డేటాను విడుదల చేసింది. బిగ్ బాస్ కు ప్రజాదరణ పెరిగే కొద్దీ, ఈ షోకు స్పాన్సర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. 2025 నాటికి, 46 విభాగాలకు చెందిన 625కు పైగా బ్రాండ్లు ఈ షోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వీటిలో 49 కొత్త బ్రాండ్లు ఉన్నాయని జియో హాట్ స్టార్ వెల్లడించింది. ఇప్పుడీ వివరాలన్నీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఫ్యాన్స్‌ అండ్ లవర్స్‌తో పాటే.. నెటిజన్స్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *