మీ UAN యాక్టివేట్ చేశారో.. లేదో స్టేటస్ చెక్ చేసుకునేందుకు.. ఉమాంగ్ యాప్‌లోని ‘UAN సర్వీసెస్ త్రూ ఫేస్ ఆథ్’ కింద ఉన్న ‘UAN కేటాయింపు, యాక్టివేషన్’ ఎంపికకు వెళ్లండి. మీ UAN, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సమ్మతి బాక్స్‌ను టిక్ చేసి చేయండి. అనంతరం ‘OTP పంపండి’పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ విజయవంతమైతే.. ‘నమోదు చేసిన UAN ఇప్పటికే యాక్టివేట్ చేయబడింది’ అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది.