
గతంలో తమన్నా కెరీర్ నెమ్మదించిందన్న వార్తలకు మిల్కీ బ్యూటీ తెరదించారు. ఒక దశలో అవకాశాలు తగ్గాయని భావించిన ఈ భామ, ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో తన కెరీర్ కు కొత్త ఊపునిచ్చారు. ప్రస్తుతం తమన్నా ఇతర సీనియర్ హీరోయిన్లలో ఎవరూ లేనంత బిజీగా ఉన్నారు, పలు ప్రతిష్టాత్మక చిత్రాలలో భాగమవుతున్నారు.కొద్ది రోజుల క్రితం తమన్నా సిల్వర్ స్క్రీన్ ప్రయాణం చివరి దశకు చేరుకుందని, ఆమె ఓటీటీ ప్రాజెక్టులకే పరిమితం అవుతున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ఊహాగానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ, స్వల్ప విరామం తర్వాత తమన్నా తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఆమె ఒక వైపు స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు ప్రధాన పాత్రల్లో నటిస్తూ తన సత్తాను చాటుకుంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన వన్, వరుణ్ ధావన్ తో కలిసి నో ఎంట్రీ 2, జాన్ అబ్రహం తో మారియా ఐపీఎస్ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో పాటు, ఆమె ఒక కీలకమైన మరియు బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు.