గ్లోబల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ షోకు ఇండియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. కోవిడ్ సమయంలో ఇండియన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మనీ హెయిస్ట్, ఐదు సీజన్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సీజన్ ఫైవ్ ను రెండు వాల్యూమ్స్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రిలీజ్ సమయంలో కార్పొరేట్ కంపెనీలు ఏకంగా హాలిడే ప్రకటించాయంటే దాని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన మనీ హెయిస్ట్ సీజన్ ఫైవ్ ను ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ లోనూ స్ట్రీమ్ చేశారు. దీంతో లోకల్ ఆడియన్స్ కూడా ప్రొఫెసర్ పాత్రకు గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు. తాజాగా మనీ హెయిస్ట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.