Headlines

చిత్రం మూవీకి ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ తీసుకున్నా.. కుండబద్దలు కొట్టిన తనికెళ్ల భరణి..

చిత్రం మూవీకి ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ తీసుకున్నా.. కుండబద్దలు కొట్టిన తనికెళ్ల భరణి..


టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. రచయితగా కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు తనికెళ్ల భరణి. తన సినీ ప్రయాణంలో ఎదురైనా ఆసక్తికర మలుపులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారాయన. ఆయన మాటలు వింటుంటే సినిమా రంగం ఎంత చిత్రవిచిత్రంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ‘చిత్రం’ సినిమా విషయంలో ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ సినిమా కోసం ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట!

దర్శకుడు తేజ తన మొదటి సినిమా ‘చిత్రం’ తీస్తున్నప్పుడు, భరణి దగ్గరకు వచ్చి కథ వినిపించారట. అప్పటికే తేజ అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేస్తున్న కాలం నుంచే వీరిద్దరికీ మంచి పరిచయం ఉంది. కథ విన్న భరణికి అది బాగా నచ్చడంతో, “ఒకవేళ ఈ సినిమా హిట్ అయితేనే నాకు ఒక్క రూపాయి ఇవ్వు, లేదంటే వద్దు” అని తేజతో అన్నారట. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయ్యాక తేజ ఆయనకు లక్ష రూపాయలు ఇచ్చి తన కృతజ్ఞత చాటుకున్నారట. అప్పటి నుంచి తేజ తీసే ప్రతి సినిమా కథను భరణికి వినిపించడం ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది.

భరణి రచయితగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కానీ ‘కోనసీమ కుర్రాడు’ అనే సినిమాకు మాటలు రాస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఒక వింతైన శత్రుత్వం మొదలైందట. అప్పటికే సగం స్క్రిప్ట్ రాసి హాస్పిటల్ పాలైన సీనియర్ రచయిత సత్యమూర్తి అనుమతి లేకుండా తను రాయలేనని భరణి మొండికేశారట. చివరికి సత్యమూర్తిని కలిశాక, ఆయన తనను ఆశీర్వదించడంతో ఆ పని పూర్తి చేశారట. అయినప్పటికీ, ఒక ఏడాది పాటు సత్యమూర్తి తనను ఏమంటారో అని భరణి భయపడుతూనే ఉండేవారట. చివరకు ‘మురారి’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మళ్లీ కలిసినప్పుడు, సత్యమూర్తి ఆయనను ఎంతో ఆప్యాయంగా పలకరించడంతో ఆ భయం తొలగిపోయిందట. డబ్బు కంటే గౌరవానికి, స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తుల్లో భరణి ఒకరు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఉచితంగా పనిచేసి పెట్టడానికి కూడా ఆయన వెనకాడరు. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనను అందరూ ఒక గురువుగా, మార్గదర్శిగా చూస్తుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *