Headlines

నాడు ప్రపంచకప్‌ అందించిన హీరో.. నేడు టీం పాలిట ఐరెన్‌లెగ్‌.. కట్‌చేస్తే.. స్వ్కాడ్ నుంచి పీకేసిన గంభీర్?

నాడు ప్రపంచకప్‌ అందించిన హీరో.. నేడు టీం పాలిట ఐరెన్‌లెగ్‌.. కట్‌చేస్తే.. స్వ్కాడ్ నుంచి పీకేసిన గంభీర్?


భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ తప్పుకోనున్నాడా? గత కొంతకాలంగా సాగుతున్న ఈ ప్రచారానికి బీసీసీఐ వర్గాలు ఎట్టకేలకు స్పందించాయి. ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పటికీ, పేలవ ఫామ్ కారణంగా సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా హార్దిక్ పాండ్యాను నియమిస్తారనే వార్తలపై స్పష్టతనిస్తూ, ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని బోర్డు కీలక ప్రకటన చేసింది.

అసలేం జరుగుతోంది..?

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌ను విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్‌గా చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. అయితే, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున ఆయన ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత టీ20 పగ్గాలు చేపడతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి.

బీసీసీఐ వర్గాల వివరణ..

సూర్యకుమార్ తొలగింపు వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఇవన్నీ కేవలం నిరాధారమైన ప్రచారాలని స్పష్టం చేశాయి. “కెప్టెన్‌ను ఎంపిక చేసేది సెలెక్టర్లు. ఇప్పటి వరకు అటు సెలక్షన్ కమిటీలో కానీ, ఇటు టీమ్ మేనేజ్‌మెంట్‌లో కానీ నాయకత్వ మార్పు గురించి ఎటువంటి చర్చ జరగలేదు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతానికి భారత టీ20 జట్టుకు అధికారిక కెప్టెన్‌గా కొనసాగుతారు” అని బోర్డు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

రికార్డుల వీరుడు సూర్యకుమార్..

భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల తర్వాత ప్రపంచకప్ అందించిన మూడవ కెప్టెన్‌గా సూర్య నిలిచారు. 2026 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 242 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించారు. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించడంలో ఆయన నాయకత్వం కీలకమైంది.

భారత్ ముందున్న సవాళ్లు..

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి, ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే యోచనలో సెలెక్టర్లు ఉన్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమ్ ఇండియా పిలుపు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి సూర్యకుమార్ కెప్టెన్సీకి వచ్చిన ముప్పేమీ లేనప్పటికీ, రాబోయే సిరీస్‌లలో ఆయన బ్యాటింగ్‌ ఫామ్‌ను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *