Headlines

బలం వర్సెస్ విషం.. పైథాన్ Vs కింగ్ కోబ్రా పోరు.. గెలుపు ఎవరిది..?

బలం వర్సెస్ విషం.. పైథాన్ Vs కింగ్ కోబ్రా పోరు.. గెలుపు ఎవరిది..?


ప్రకృతిలో కొన్ని పోరాటాలు కేవలం రెండు జంతువుల మధ్య జరిగేవి కావు.. రెండు భిన్నమైన శక్తుల మధ్య జరిగే సమరం లాంటివి. అలాంటి అరుదైన పోరాటాల్లో ఒకటి కొండచిలువ, కింగ్ కోబ్రా మధ్య జరిగే ఫైట్. ఒకటి అపారమైన శారీరక బలం మీద ఆధారపడితే.. మరొకటి ప్రాణాంతకమైన విషాన్ని ఆయుధంగా ఉపయోగిస్తుంది.

పైథాన్ ఒక విషం లేని భారీ పాము. కానీ దాన్ని బలహీనంగా భావించడం పెద్ద తప్పు. దీని అసలైన బలం దాని మజిల్ పవర్. వేట దగ్గరకు వచ్చిన క్షణంలో శరీరం మొత్తం చుట్టుకుని బిగిగా పిసికేస్తుంది. చాలామంది అనుకునేలా కేవలం శ్వాస ఆడకుండా చేయడం మాత్రమే కాదు.. తాజా అధ్యయనాల ప్రకారం పైథాన్ చుట్టుకున్న తర్వాత రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. దీంతో వేట చాలా వేగంగా చనిపోతుంది. ఒక్కసారి పూర్తి కంట్రోల్ తీసుకుంటే దాని నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం.

మరోవైపు కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన విషసర్పం. ఇతర పాములే దీని ప్రధాన ఆహారం కావడం దీన్ని మరింత ప్రమాదకర వేటగాడిగా నిలబెడుతుంది. దీని అసలైన బలం న్యూరోటాక్సిక్ విషం. కాటు వేసిన తర్వాత ఆ విషం నేరుగా నర్వస్ సిస్టమ్‌పై దాడి చేస్తుంది. శరీర నియంత్రణ దెబ్బతిని, శ్వాసక్రియ కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

కింగ్ కోబ్రా వేగం, అలర్ట్‌నెస్ విషయంలో పైథాన్ కంటే ముందుంటుంది. ఇది తల ఎత్తి ప్రత్యర్థిని అంచనా వేసి, మెరుపువేగంతో స్ట్రైక్ చేసి వెంటనే వెనక్కి తగ్గే టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఒక్క కాటుతో ఏనుగునే చంపేస్తుంది అనే ప్రచారం కొంత అతిశయోక్తిగా భావిస్తారు. కానీ దీని విషం అత్యంత ప్రమాదకరమైనదన్న విషయం మాత్రం నిజం.

ఈ రెండు పాముల మధ్య పోరులో గెలుపును నిర్ణయించేది కేవలం బలం లేదా విషం మాత్రమే కాదు.. తొలి కదలిక. కింగ్ కోబ్రా ముందుగా బైట్ చేసి దూరం కాపాడుకోగలిగితే విషం పని చేసే అవకాశాలు ఎక్కువ. అదే పైథాన్ ముందుగా శరీరం చుట్టుకుని బాడీ కంట్రోల్ తీసుకుంటే కోబ్రాకు కాటు వేసే అవకాశం తగ్గిపోతుంది.

పరిస్థితులు కూడా ఈ పోరులో కీలకం అవుతాయి. ఓపెన్ స్పేస్‌లో ఉంటే కింగ్ కోబ్రాకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. సమీప దూరంలో, ఒక్కసారి పట్టుకునే అవకాశం వస్తే పైథాన్ మరింత ప్రమాదకరం అవుతుంది.

అయితే ప్రకృతిలో ఇలాంటి పోరాటాలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే అడవిలో ప్రతి జంతువు పోరాటం కంటే బతకడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అయినా సరే, పైథాన్ – కింగ్ కోబ్రా ఫైట్ అంటే ఇప్పటికీ వైల్డ్‌లైఫ్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఊహాజనిత సమరాల్లో ఒకటిగా భావిస్తారు.

Also Read: మామిడి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతు.. ఓ చెట్టు కింద గడ్డిలో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *