Headlines

Body Circadian Rhythm: మీ శరీరం మాట కాస్త వినండి.. ఏ టైంలో నిద్రపోవాలి.. ఏ టైంకి నిద్రలేవాలో చెప్పేందుకూ ఓ లెక్కుంది

Body Circadian Rhythm: మీ శరీరం మాట కాస్త వినండి.. ఏ టైంలో నిద్రపోవాలి.. ఏ టైంకి నిద్రలేవాలో చెప్పేందుకూ ఓ లెక్కుంది


ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎన్ని గంటలు నిద్రపోతామనేది ఎంత ముఖ్యమో, ఉదయం మనం నిద్రలేచే సమయం కూడా అంతే ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం తగినంత నిద్రపోయినప్పటికీ మీరు తప్పుడు సమయంలో నిద్రలేస్తే మీకు తెలియకుండానే తీవ్రమైన వ్యాధులను కొనితెచ్చుకుంటున్నట్లు అవుతుంది. ఆయుర్వేదంలో సూర్యోదయానికి సుమారు 1 గంట 36 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం సాధారణంగా ఉదయం 4 గంటల నుండి 5.30 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేవడం శరీరంలోని వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. సైన్స్‌ ప్రకారం మన శరీరం జీవ గడియారం (సర్కాడియన్ రిథమ్) ప్రకారం పనిచేస్తుంది. ఉదయం 6 నుంచి 8.30 గంటల మధ్య శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది మనల్ని ఉత్తేజపరుస్తుంది.

మీరు రాత్రి 9-10 గంటల తర్వాత కూడా మేల్కొని ఉంటే శరీరంలోని మెలటోనిన్ సమతుల్యతకు భంగం వాటిల్లి, రోజంతా నీరసంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ శరీరానికి అవసరమయ్యే నిద్ర, నిద్రపోయే సరైన సమయం మారుతూ ఉంటాయి. 6 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల శారీరక ఎదుగుదలకు 9 నుండి 11 గంటల నిద్ర అవసరం. వారు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య నిద్రలేవడం ఉత్తమం. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు 7 గంటల నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. వీరు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల మధ్య నిద్రలేవాలి. ఉద్యోగం చేసేవారు లేదా వ్యాపారం చేసేవారికి 7-8 గంటల నిద్ర సరిపోతుంది. వారు ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య నిద్రలేవాలి. అయితే 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు 7-8 గంటలు నిద్రపోవాలి. వీరు ఉదయం 5 గంటల లోపు నిద్రలేవాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ధ్యానం, చదువు, సృజనాత్మక పనులకు తెల్లవారుజాము ఉత్తమ సమయం. ఈ సమయంలో వాతావరణంలో ఓజోన్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు, మెదడుకు అమృతంలా పనిచేస్తుంది. సరైన సమయంలో నిద్రలేవడం మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీర శక్తి స్థాయిలను కాపాడుతుంది. అందువల్ల కేవలం తగినంత నిద్రపోవడం మాత్రమే సరిపోదు ప్రకృతి చక్రంతో పాటు సాగిపోవడమే దీర్ఘాయువుకు మూలసూత్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *