Headlines

EV వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! UBCతో ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌!

EV వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! UBCతో ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌!


EV వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! UBCతో ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌!

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ‘యూనిఫైడ్ భారత్ ఇ-ఛార్జ్ (UBC)’ పేరుతో జాతీయ స్థాయి ఏకీకృత EV ఛార్జింగ్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. బెంగళూరులో జరిగిన పీఎం ఇ-డ్రైవ్ పథక సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ యాప్ ద్వారా దేశంలోని వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న EV ఛార్జింగ్ స్టేషన్లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో కనుగొని, ఉపయోగించి, చెల్లింపులు చేయవచ్చని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు యాప్‌లు, వేర్వేరు చెల్లింపు విధానాలు ఉండటంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త UBC యాప్ ఈ సమస్యలకు పరిష్కారంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

BHIM యాప్ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవం తీసుకువచ్చినట్లే, UBC భారతదేశ EV ఛార్జింగ్ రంగంలో పెద్ద మార్పుకు దారితీస్తుంది” అని కుమారస్వామి పేర్కొన్నారు. భీమ్ యాప్ ద్వారా EV ఛార్జింగ్ చెల్లింపులను అనుసంధానించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద రూ.2,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 4,874 EV ఛార్జర్ల ఏర్పాటుకు రూ.503.86 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. కర్ణాటకలో మాత్రమే 1,243 ఛార్జర్లకు రూ.123.26 కోట్ల మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఇక టాటా పవర్‌, ఛార్జ్‌జోన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి ప్రైవేట్ సంస్థలు కూడా EV పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి అభినందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ పథకాలు, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్ తయారీ, రేర్ ఎర్త్ మాగ్నెట్ ప్రాజెక్టులు EV రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని కేంద్రం భావిస్తోంది. 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో ఈ చర్యలు కీలకమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *