Headlines

CM Vijay: విజయ్ కారు నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ.. వింటే కన్నీళ్లు ఆగవు

CM Vijay: విజయ్ కారు నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ.. వింటే కన్నీళ్లు ఆగవు


తమిళ నటుడు విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ల క్రితం పార్టీని స్థాపించిన విజయ్ తొలి ప్రయత్నం లోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రికార్డు సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత విజయ్ ప్రయాణించిన కార్లు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన బస్సు, ప్రచార రథాల రిజిస్ట్రేషన్ నంబర్ను చూసిన అందరూ అసలు విషయం ఏంట అని ఆరా తీయడం మొదలుపెట్టారు. సెలబ్రిటీలు సినిమా నటులు వాడే కార్లకు చాలామంది ఫ్యాన్సీ నెంబర్లు ఉండడం గమనించే ఉంటారు.. ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ సెంటిమెంట్ గా ఉంటుంది.. రాజకీయ నాయకులకు కూడా తమకార్లకు ఓకే నంబరు ఉండేలా చూసుకుంటుంటారు.. అది వారికి కలిసి వచ్చిన నంబర్ గా భావిస్తూ ప్రతి వాహనానికి అదే నెంబర్ ఉండేలా జాగ్రత్తగా పడుతుంటారు.. తాజాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ వాహనాలకు ఒకటే నెంబర్ ఉండడంపై ఆర్ఆర్ చేసిన అభిమానులకు ఒక ఎమోషనల్ ట్రూత్ బయటపడింది.

ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..

విజయ్ వాడే ప్రతి కారుకు ఒకటే నంబరు ఉండడం.. ఆ నంబర్ వెనుక అసలు విషయం తెలుసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విజయ్ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడిన ప్రతి కారుకు ఒకటే నంబరు ఉండడాన్ని ఇటీవల చాలామంది గమనించారు. ఆ నంబర్ 0277. ఇంతకీ 0277 అనే నెంబరు విజయ్ ఎందుకు ప్రతి వాహనానికి ఉండేలా ప్రత్యేకంగా చూసుకోవడానికి కారణమేంటి అని ఆరా తీయగా ఒక ఎమోషనల్ రీజన్ ఆ నెంబర్ వెనక ఉన్నట్లు బయటపడింది. విజయకు తోడబుట్టిన చెల్లెలు ఉండేది. చెల్లెల పేరు విద్య. ఫిబ్రవరి 14 1977లో అనారోగ్యంతో చెల్లెలు విద్య చనిపోయింది.

ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

విజయ్ కి చెల్లెలు అంటే ఎంతో ఇష్టం. తన చెల్లెలు జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో పాటే గుర్తుండేలా ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ను పెట్టుకుంటున్నారు. ఫిబ్రవరి అంటే 02 చనిపోయిన ఏడాదిలోని చివరి రెండు నెంబర్లు 77 కలిపి 0277 అనే నెంబర్ను కారుకు ఎన్నికల సమయంలో ఉపయోగించిన ప్రచార రథానికి ఉండేలా చూసుకున్నారు. గతంలో విజయ్ కారు నెంబర్ను పెద్దగా గమనించని వారందరూ ఇప్పుడు అన్ని కార్లకు ఒకే నెంబర్ ఉండడంపై ప్రత్యేకత ఏంటి అని ఆరా తీయగా అసలు విషయం సోషల్ మీడియా వేదికగా బయటపడింది. చాలామంది విజయ్ వాహనాలకు ఉన్న నెంబర్ను చూసి న్యూమరాలజీ ప్రకారం సెంటిమెంట్ గానే ఈ నెంబర్ వాడుతున్నారని ముందుగా భావించినా ఆ తర్వాత విషయం తెలుసుకొని అభిమానులు కూడా ఎమోషన్ అవుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *