Headlines

ఫాంటసీ ప్రపంచంలోకి కుర్ర హీరోల అడుగులు

ఫాంటసీ ప్రపంచంలోకి కుర్ర హీరోల అడుగులు


ఎంతసేపూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకు కూడా బోర్ కొడుతుంది కదా..? ఏదో ఓ టైమ్‌లో వాళ్లు కూడా లైన్ దాటాల్సిందే కదా.. అదే చేస్తున్నారిప్పుడు మన హీరోలు. ఇమేజ్‌తో పనిలేకుండా.. ఏ మార్కెట్‌తో సంబంధం లేకుండా.. కథ నచ్చితే ఫాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో ఇదే చేసాడు. మరి ఈ ఫాంటసీ వరల్డ్‌పై మనమూ ఓ కన్నేద్దామా..? మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫాంటసీ ప్రపంచాలు కావాలంటున్నారు. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్లేదు.. అలాంటి కథలే చేస్తామంటున్నారు. ఆల్రెడీ నాగ చైతన్య వృషకర్మ అంటూ స్పిరిచువల్ డ్రామాతో రాబోతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ సైతం సంబరాల ఏటిగట్టు తర్వాత క డైరెక్టర్స్ సుజీత్ సందీప్‌తో ఫాంటసీ థ్రిల్లర్ చేయబోతున్నారు. నిఖిల్ స్వయంభు కూడా ఫాంటసీ సినిమానే.. 300 ఏళ్ళ నాటి కథ ఇది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న స్వయంభులో యోధుడిగా నటిస్తున్నారీయన. ది ఇండియా హౌజ్ సినిమా కూడా ఒకరమైన ఫాంటసీ కమ్ పీరియడ్ సినిమా. అలాగే అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న నాగబంధం కూడా పూర్తిగా ఫాంటసీ డ్రామానే. మే 7న సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా శంబాల ఫేమ్ యుగంధర్ ముని కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసారు. ఇది కూడా ఫాంటసీ సినిమానే.. ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఉన్నాయి.. ఇవన్నీ చూస్తుంటే ఫారెస్ట్ అడ్వంచర్ అని అర్థమవుతుంది. అలాగే పవర్ పేట సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసారు మేకర్స్. మొత్తానికి ఫాంటసీ కథలే కుర్రాళ్ల మనసుల్ని దోచేస్తున్నాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు

పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *