Headlines

విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!

విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!


టీవీ9 ‘క్రాస్‌ఫైర్’లో మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో మాజీ మంత్రి రోజా జరిపిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏపీలో వైసీపీ ఓటమికి ఈవీఎంల గోల్ మాల్ కారణమని ఆరోపిస్తూనే, తమిళనాడులో విజయ్ గెలుపును సమర్థించారు. కేంద్రంపై వైసీపీకి ప్రత్యేక వైరం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక ఇంటర్య్వూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయం వెనుక వైఎస్ జగన్ స్ఫూర్తి ఉందన్నది రోజా ప్రధాన వాదన. విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి ఆయన ప్రసంగాల వరకు అన్నీ జగన్‌ను పోలి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఫోటోను చూపించడాన్ని గుర్తు చేస్తూ.. “విజయ్‌ను గెలిపించడం అంటే జగన్‌ను ఆశీర్వదించడమే” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వైసీపీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని పునరుద్ఘాటించిన రోజా, చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేసిన అభ్యర్థులందరూ ఓడిపోయారని, ఆ వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికే తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వచ్చే ట్రోలింగ్స్‌ను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను టెలివిజన్ షోలు చేయడంలో తప్పేమీ లేదని, అది తన వృత్తి అని సమర్థించుకున్న రోజా, తన కుమారుడిని హీరోగా చేయాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా జగన్ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు రోజా స్పష్టం చేశారు. మొత్తానికి, తమిళనాడు రాజకీయ పరిణామాలను ఏపీతో ముడిపెడుతూ రోజా చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగా, ఇటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *