Tollywood: సార్.. మీరేంటిలా మారిపోయారు? ఒక్పటి ఈ తెలుగు యాక్షన్ హీరోను గుర్తు పట్టారా? వీడియో

Tollywood: సార్.. మీరేంటిలా మారిపోయారు? ఒక్పటి ఈ తెలుగు యాక్షన్ హీరోను గుర్తు పట్టారా? వీడియో


పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసే వారైతే ఈజీగానే గుర్తు పట్టి ఉంటారు. ఒకప్పుడు ఆయన తెలుగులో ఫేమస్ హీరో. కరాటేలో బ్లాక బెల్ట్ సాధించి వరుసగా యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించాడు. తన పవర్ ఫుల్ యాక్షన్ తో చిరంజీవి, బాలకృష్ణ, సుమన్ వంటి టాప్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. కేవలం హీరోగానే కాకుండా సహాయక నటుడిగానూ, కొన్ని సినిమాల్లో విలన్ గానూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి వయసు సుమారు 70 ఏళ్లకు పైనే. గతంలోలా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. అయితే ఈ నటుడికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. గతంలో చాక్లెట్ బాయ్ లా కనిపించిన ఆ హీరో ఇప్పుడు నెరిసిన జట్టు, గడ్డంతో అసలు గుర్తు పట్టలేకుండా మారిపోయారు. కానీ ఆ వాయిస్ చూసి మన భానుచందరే అని గుర్తు పట్టారు. వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్, ‘ గోదావరి రుచులు ‘ అధినేత చిట్టిబాబుకి భానుచందర్ వీరాభిమాని. ఈ క్రమంలోనే చిట్టిబాబు పెళ్లిరోజు సందర్భంగా భానుచందర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.

అయితే, ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ వీడియోలో భానుచందర్‌ అసలు గుర్తు పట్టలేకుండా ఉన్నారు. పూర్తిగా తెల్ల జుట్టు, గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒకప్పటి యాక్షన్ హీరో భాను చందర్ కు, ఇప్పటి భానుచందర్ కు అసలు పోలికే ఉండడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు సుమారు 70 ఏళ్లకు పైనే. కాబట్టి ఇది సహజంగా వచ్చిన మార్పేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రూపం మారినా భాను చందర్ మాటల్లో అదే గంభీరం కనిపిస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా ప్రస్తుతం సహాయక నటుడిగా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు భానుచందర్. 2022లో ‘కిన్నెరసాని’, ‘శాకిని డాకిని’ లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేయగా, 2024లో ‘రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్)’ లో, అలాగే మ్యూజిక్ షాప్ మూర్తిలోనూ కీలక పాత్రలు పోషించారు. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *