TG PECET 2026: టీజీ పీఈసెట్‌ 2026కు దరఖాస్తు చేశారా? ఇంకొన్ని గంటలే ఛాన్స్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో

TG PECET 2026: టీజీ పీఈసెట్‌ 2026కు దరఖాస్తు చేశారా? ఇంకొన్ని గంటలే ఛాన్స్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో


తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్‌ 2026) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. వ్యాయామ విద్యలో రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్‌ 2026కు దరఖాస్తుకు మే 5, 2026వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి మే 5వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (మంగళవారం) ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహణ అధికారులు తెలిపారు.

టీజీ పీఈసెట్‌- 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

టీజీ పీఈసెట్‌-2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ విద్యా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. డీపీఈడీలో ప్రవేశాలకు ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండలి. బీపీఈడీ కోర్సుకు మాత్రం ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.900, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రూ.500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.2 వేలు ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫిజికల్‌ ఎఫిషియన్సీ అండ్‌ స్కిల్‌ టెస్ట్‌లు మే 31, 2026వ తేదీ నుంచి జూన్ 3, 2026వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షల హాల్‌ టికెట్లు మే 22 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఫలితాలు జూన్‌ 6, 2026న వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

టీజీ పీఈసెట్‌- 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు..

  • ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: మే 5, 2026.
  • రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 15 వరకు
  • రూ. 2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 20 వరకు
  • హాల్‌టికెట్లు విడుదల తేదీ: మే 22, 2026 నుంచి
  • రాత పరీక్షల తేదీలు: మే 31 నుంచి జూన్ 3
  • ఫలితాలు వెల్లడి: జూన్ 6, 2026

టీజీ పీఈసెట్‌- 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *