బంగారం ధరలు పడిపోతున్నాయి. ఉదయం ఒకరేటు ఉండగా.. మార్కె్ట్లు ప్రారంభం కాగానే ధరలు మారిపోతున్నాయి. ఇటీవల గత కొద్దిరోజులుగా బంగారం ధరలు కుప్పకూలుతూ వస్తోన్నాయి. ఈ వారం కూడా అదే బాటలో నడుస్తున్నాయి. సోమవారం బంగారం ధరలు పతనమవ్వగా.. మంగళవారం మరింత తగ్గుముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత రూ.1.50 లక్షల మార్క్ దిగువకు గోల్డ్ రేట్లు చేరుకున్నాయి.
తగ్గిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,49,620 వద్ద స్థిరపడ్డాయి. ఈ రోజు రూ.440 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,750గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,37,150గా ఉండగా.. నిన్నటితో చూస్తే రూ.400 తగ్గింది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,770గా ఉండగా.. నిన్న రూ.1,52,730గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1960 తగ్గింది. 22 క్యారెట్ల రేటు రూ.1,38,200 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1.40 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.1800 తగ్గిందని చెప్పవచ్చు.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,180 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,750గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,230గా ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,36,900 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.65 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఏకంగా రూ.10 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది.




