ప్రజల సొమ్ముతో అధికార హోదాను అనుభవిస్తున్న దేవాదాయ శాఖలో జవాబుదారీతనం మరియు పారదర్శకత లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ శాఖను కచ్చితంగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు మూడు వంతుల భూమి అక్రమణకు గురై ఉండవచ్చని నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నంద్యాల జిల్లాలోనే 35 వేల ఎకరాల భూమి ఉంటే అందులో వెయ్యి ఎకరాలు కబ్జాకు గురైంది.