
టాలీవుడ్లో థియేటర్లు, టికెట్ రేట్ల వివాదం తిరిగి మొదలైంది. “జెట్లీ” సినిమా విషయంలో మల్టీప్లెక్స్‌లు స్క్రీన్లు ఇవ్వకపోవడంపై మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ విధానంపై ఉన్న సమస్యలను లేవనెత్తుతూ, మల్టీప్లెక్స్‌లను ఈ వివాదంలోకి లాగడంపై ఆ లేఖలో ప్రశ్నించారు. ఈ సమస్య మైత్రి వంటి పెద్ద సంస్థలకే వస్తే, చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తాయి.హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ విధానానికే మొగ్గు చూపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనికి వ్యతిరేకంగా 16 మంది నిర్మాతలు ఏకమై పత్రికా ప్రకటన విడుదల చేశారు. టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.