1978లో విడుదలైన ఒక అద్భుతమైన తెలుగు ప్రేమకథ సినిమా. డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ , సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ మరియు సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో రంగుల చిత్రాలు వస్తున్నప్పటికీ, ఈ సినిమా నలుపు-తెలుపు (Black & White) లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా పేరు మరో చరిత్రం. దాదాపు 48 ఏళ్లుగా ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయారు. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. 1978 మే నెలలో విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఒక తమిళ అబ్బాయి, ఒక తెలుగు అమ్మాయి ప్రేమలో పడటం గురించిన కథ. వారిద్దరి కుటుంబాలు ఈ ప్రేమను అంగీకరించవు. వారిని ఒక సంవత్సరం పాటు విడివిడిగా ఉండమని కోరతారు. ఆ సమయంలో వారిద్దరి జీవితాన్ని తీరని విషాదం నెలకొంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
తెలుగు, తమిళం భాషలలో విడుదలైన ఈ సినిమా మూడు రాష్ట్రాల్లో దాదాపు సంవత్సరంపాటు ఏకదాటిగా ప్రదర్శించారు. ‘మరో చరిత్ర’కు ముందు, బాలచందర్ దర్శకత్వంలో కమల్ నటించిన అంతులేని కథ అప్పటి ఉమ్మటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజులు ఆడింది. ఈ సినిమా విజయంతో కమల్‌కు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఆయన అన్నింటినీ పక్కనపెట్టి, తన గురువు బాలచందర్ దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే ‘మరో చరిత్ర’ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ను వెతుకుతున్న కె. బాలచందర్, 161 మంది మహిళలను చూసినా సెలక్ట్ చేయలేకపోయారు. 162వ మహిళగా అభిలాషను స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆ అమ్మాయి అప్పట్లో 10వ తరగతి చదువుతోంది. బాలచందర్‌కు ఆమె నచ్చింది. ఆమె పేరును సరితగా మార్చారు డైరెక్టర్ బాలచందర్.
ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..
మరో చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లోని 18 కేంద్రాలలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇక్కడ 450 రోజులకు పైగా ఆడింది. అంతేకాదు.. ఈ చిత్రం హైదరాబాద్‌లోని థియేటర్లలో ఏకధాటిగా 556 రోజుల పాటు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రాలలో ఒకటిగా నిలిచి, అప్పట్లో రికార్డులను తిరగరాసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..