టాలీవుడ్ సీనియర్ నటీమణి సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అక్కగా, అత్తగా, వదినగా.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారీ అందాల తార. వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. అయితే తన స్థానంలోతన కూతురు సుప్రితను సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసింది. ఇప్పటికే అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది సుప్రిత. ఇదిలా ఉంటే సురేఖా వాణి భర్త చాలా ఏళ్ల క్రితమే కన్నుమూశారు. అయినా సింగిల్ మదర్ గానే కూతురిని పెద్ద చేసింది సురేఖ. సురేఖా వాణిది ప్రేమ వివాహం. ఆమె భర్త పేరు సురేష్ తేజ. కెరీర్ ప్రారంభంలో మా ఛానెల్ లో కొంత కాలం పాటు పని చేసింది సురేఖ. అదే సమయంలో మా టీవీలోనే సురేష్ పనిచేసేవారు. పలు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్గా చేశారు. సురేఖా వాణి యాంకరింగ్ చేసిన మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలు సురేష్ తేజ డైరెక్ట్ చేశారు. . అలా వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నేళ్లకు వీరికి సుప్రిత జన్మించింది.
ఇవి కూడా చదవండి
అయితే 2019 మే 06న సురేఖా వాణి భర్త సురేష్ తేజ అకస్మాత్తుగా కన్నుమూశారు. దీంతో సురేఖా వాణితో పాటు కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన చనిపోయారు. ఈ క్రమంలో తన తండ్రి మరణం గురించి సుప్రిత ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది. ‘మా నాన్నకి ఎక్కువగా నడిచే అలవాటు ఉండేది. ఓసారి ఎక్కువ నొప్పి రావడంతో డాక్టర్ను సంప్రదిస్తే.. ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. సర్జరీ చేసి కాలి వేళ్ల వరకు తీసేద్దామని చెప్పారు. అలా సర్జరీ చేసిన తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యింది. ఈ లోపు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఈ విషయాలన్నీ ఇప్పటి వరకు అమ్మ కూడా ఎక్కడా చెప్పలేదు. నాన్న మరణం నన్ను ఇప్పటికీ వెంటాడుతూ ఉంటుంది’ అని సుప్రిత ఎమోషనల్ అయ్యింది.
కూతురు సుప్రితతో నటి సురేఖా వాణి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.