OTT Movie: ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అబ్బాస్ విలనిజం కోసమైనా చూడాల్సిందే

OTT Movie: ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అబ్బాస్ విలనిజం కోసమైనా చూడాల్సిందే


ప్రేమ దేశం హీరో అబ్బాస్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు అబ్బాస్. ప్రేమకథా చిత్రాలు, యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ మూవీస్ లో నటించి యూత్ కు ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అదృశ్యమైపోయాడు ట్యాలెంటెడ్ యాక్టర్. న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయాడు. అయితే ఈ మధ్యనే మళ్లీ ఇండియాకు వచ్చేశాడు. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అబ్బాస్ కీలక పాత్రలో నటించిన హ్యాపీరాజ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అబ్బాస్ మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు, వ్యవస్థలోని లొసుగుల ఇతివృత్తంతో రూపొందిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఎగ్జామ్’ (Exam). గతంలో విక్రమ్ వేద మూవీతో సెన్సేషన్ క్రియేట్ క్రియేట్ చేసిన తమిళ దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి ఈ సిరీస్ ను రూపొందించారు.

ఎ సర్కుణం దర్శకత్వం వహించిన ఎగ్జామ్ వెబ్ సిరీస్ లో దుషార విజయన్, అదితి బాలన్, అబ్బాస్, నరేన్ మణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అబ్బాస్‌కు ఇదే మొదటి ఓటీటీ ప్రాజెక్టు కావడం విశేషం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నూ అందుబాటులోకి రానుంది. ఇటీవల రిలీజైన ఎగ్జామ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో ఎగ్జామ్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఎగ్జామ్ వెబ్ సిరీస్.. ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *