Post Office: మహిళలకు పోస్టల్ శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ అకౌంట్ తీసుకుంటే అన్నీ ఉచితమే..

Post Office: మహిళలకు పోస్టల్ శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ అకౌంట్ తీసుకుంటే అన్నీ ఉచితమే..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ దేశ ప్రజల కోసం మరో కీలక ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు మరో కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించేందుకు స్వయం సహాయక బృందాల సేవింగ్స్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల స్వయం సహాయక సంఘాల(SHG)కు సులభమైన, సరసమైన బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. చిన్న వ్యాపారులు, లేదా ఆర్ధిక కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించే మహిళలకు ఇది ఉపయోగపడనుంది.  కేవలం గ్రామీణ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ కొత్త సేవింగ్స్ అకౌంట్ లాంచ్ చేశారు. అసలు అకౌంట్ బెనిఫిట్ ఏంటి..? దీనిని ఎలా ఓపెన్ చేయాలి? అనే విషయాలు చూద్దాం.

SHG సేవింగ్స్ అకౌంట్ ప్రత్యేకతలు

-గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన అకౌంట్ ఇది

-స్వయం సహాయక సంఘాలకు బ్యాంకింగ్ సేవలు సులువుగా అందటం, ఆర్ధిక నిర్వహణను బలోపేతం చేయడం దీని లక్ష్యం

-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, నాబార్డ్, గ్రామీణాభివృద్ది అజెండకు మద్దతుగా ఈ అకౌంట్ తీసుకొచ్చారు

-స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్ధిక తోడ్పాటకు ఇది సహాయపడుతుంది

అన్నీ ఉచితమే..

-పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ SHG అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి జరిమానాలు ఉండవు

-అకౌంట్ ఉచితంగా ఓపెన్ చేయవచ్చు. ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో ఉండాల్సిన అవసరం లేదు

-ఎలాంటి ఫైన్లు, రసుంలు ఉండవు

-మనీ డిపాజిట్, విత్ డ్రాకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవు

-రూ.20 లక్షల వరకు నగదు నిల్వ చేసుకోవచ్చు

-సేవింగ్స్‌పై వార్షిక వడ్డీ కూడా ఉంటుంది

-ప్రతీ నెలా ఉచితంగా ఒకసారి బ్యాంక్ స్టేట్‌మెంట్ పొందవచ్చు

-ఇక అకౌంట్ క్లోజింగ్, క్యూఆర్ కార్డు జారీ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు

-ఈ అకౌంట్‌ను మీ ఇంటి వద్దనే డిజిటల్‌గా ఓపెన్ చేయవచ్చు

-పోస్టాఫీసులు, గ్రామీణ డావ్ సేవక్‌ల సహాయంతో ఖాతా తెరవొచ్చు

-ఇంటి వద్ద నుంచే డిజిటల్ సేవల ద్వారా ఈ ఖాతాను నిర్వహించుకోవచ్చు

-గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్తరించేలా పోస్టల్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *