Headlines

Tollywood: 4 సార్లు అబార్షన్.. 65 ఇంజెక్షన్లు.. 45 ఏళ్ల వయసులో తల్లవుతోన్న ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Tollywood: 4 సార్లు అబార్షన్.. 65 ఇంజెక్షన్లు.. 45 ఏళ్ల వయసులో తల్లవుతోన్న ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్


బాలీవుడ్ బుల్లితెర నటి సంభావనా ​​సేథ్‌ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత ఆమె సరోగసీ (అద్దె గర్భం) ద్వారా తల్లి కాబోతోంది. ఈ శుభవార్తను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. సంభావనా ​​సేథ్ 2016 జూలై 14న అవినాష్ మిశ్రాను వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు, వారిద్దరూ దాదాపు 5 సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత నటి జీవితంలోకి మరో అతిథి రాబోతున్నాడు. సరోగసీ ద్వారా తమ బిడ్డను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సంభావన సేథ్, ఆమె భర్త అవినాష్ ద్వివేది తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా సంభావనా ​​సేథ్‌ మాతృత్వం కోసం ఎన్నో బాధలను భరించింది. సహజ పద్ధతిలో గర్భం ధరించడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఐవీఎఫ్ (IVF) ను కూడా ఎంచుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆమె మూడు నెలల వ్యవధిలో తాను 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తీసుకుందట. ఆ టైమ్‌లో తాను తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించింద సంభావనా సేథ్. అయితే తల్లి కావాలన్న కోరికతో ఈ బాధలన్నింటినీ భరించిందట. దీనికి తోడు ఆమెకు పలుసార్లు గర్భస్రావమైంది. ఒకసారి, రెండుసార్లు కాదు, ఏకంగా నాలుగుసార్లు తాను అబార్షన్ బారిన పడ్డాడనని ఈ అందాల తార వాపోయింది. ఇన్ని బాధాకరమైన అనుభవాలు ఎదురైనా నిరాశపడకుండా తల్లి కావాలనే తన కలను ఎట్టకేలకు సాకారం చేసుకుంది సంభావనా సేథ్. ఇప్పుడు ఆమె జీవితంలోకి ఒక కొత్త ఆనందం వచ్చింది.

ఇవి కూడా చదవండి

సంభావనా సేథ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక సినిమాల పరంగా పరంగా చూస్తే సంభావన సేత్ 2025లో వచ్చిన ‘మండల మర్డర్స్’ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని వెబ్ సిరీస్ లు ఉన్నట్లు తెలుస్తోంది.

భర్తతో సంభావనా సేథ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *