టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్. ముఖ్యంగా 2001లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో ఆకాష్, రేఖ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు.. మ్యూజికల్ సెన్సేషన్ కూడా. అయితే ఆ సినిమాలో ‘ఆకాశం సాక్షిగా..’ అంటూ తన చిరునవ్వుతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‌తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
రేఖ వేదవ్యాస్ తెలుగులో ఆనందంతో పాటు ‘దొంగోడు’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి వరుస విజయాలను అందుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా సుమారు 30కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. చేసింది తక్కువ సినిమాలే అయితే, 2014 తర్వాత ఆమె వెండితెరకు క్రమంగా దూరమయ్యారు. చాల కాలం పాటు మీడియా కంటికి చిక్కని రేఖ, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..
వైరల్ అవుతున్న ఫోటోల ప్రకారం, రేఖ చాలా బరువు తగ్గిపోయి కనిపిస్తున్నారు. ఒకప్పుడు బొద్దుగా, ఎంతో కళగా ఉన్న ఆమె ముఖం ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉంది. ఆమె గత కొంతకాలంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆమె ఇప్పుడు కోలుకున్నారు. ఆరోగ్య కారణాల వల్లే ఆమె సినిమాలకు దూరమయ్యారని, చికిత్స తీసుకునే క్రమంలో ఇలా బరువు తగ్గారని సమాచారం. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం ఆమె బెంగళూరులో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమె అప్పుడప్పుడు తన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూనే ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

Rekha Vedavyas Latest
ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..