Headlines

బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన తల్లి ఆవు.. కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు.. కన్నీళ్లు తెపిస్తున్న వీడియో

బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన  తల్లి ఆవు.. కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు.. కన్నీళ్లు తెపిస్తున్న వీడియో


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో ఆవు దూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఇది గమనించిన తల్లి ఆవు.. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లడిల్లిపోయింది. పెద్ద పెద్దగా అరుస్తూ కన్నీళ్లతో నిర్మాణంలో ఉన్న ఆ సెప్టిక్ ట్యాక్ చుట్టు ప్రదక్షిణాలు చేసింది. అటు వైపుగా వెళుతున్న స్థానికులు ఆవును చూసి చూడనట్టుగా వెళ్లిపోవడంతో ఆవేదనతో మరింత గుక్కపెట్టి అరిచింది‌. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆవు ప్రదక్షిణ చేస్తున్న స్థలానికి వెళ్లి చూడటం తో విషయం వెలుగు చూసింది. వెంటనే స్థానికుల సాయం కోరిన ఓ యువకుడు తాళ్ల సాయంతో ట్యాంక్ లో పడిపోయిన దూడను అతి కష్టం మీద సురక్షితంగా బయటకు తీశారు. బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో తల్లి ఆవు సంతోషంతో గంతులేసింది. తన బిడ్డను ప్రాణాలతో కాపాడిన స్థానికులకు ముందు కాళ్లతో మోకరిల్లి ధన్యవాదాలు చెప్పుకుంది‌ ఆ ఆవు‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్‌ ఆఫర్‌.. సిమ్‌ కొంటే పెట్రోల్‌ ఫ్రీ

Divvela Madhuri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..

సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *