విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటుచేసుకుంది.. వివాహితపై ప్రయాణికుడు అత్యాచారం చేశాడు.. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న మహిళను ట్రాప్‌చేసిన గుర్తుతెలియని యువకుడు.. మాయమాటలతో.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి.. వివాహితను తీసుకెళ్లిన నిందితుడు.. ఆ తర్వాత దారుణానికి ఒడిగట్టాడు. భర్తను టాయిలెట్స్ దగ్గర కూర్చోబెట్టి.. భార్యను ఏసీ కూపేలోకి తీసుకెళ్లి .. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. వివాహిత.. భర్తతో కలిసి విశాఖ నుంచి నడికుడి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు దిగాక అత్యాచారం గురించి భార్య భర్తకు చెప్పింది. అనంతరం భర్తతో కలిసి.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రెంటచింతల పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును రెంటచింతల పోలీసులు విజయవాడ రైల్వే పీఎస్‌కి బదిలీచేశారు.
వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు ఉపాధి నిమిత్తం కొంతకాలంగా విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ఎక్కారు. అయితే, జనరల్ బోగీలో రద్దీ ఉండటాన్ని గమనించిన నిందితుడు, బాధితురాలితో మాటలు కలిపాడు.. చివరకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలో సౌకర్యవంతంగా ఉంటుందని తీసుకెళ్లాడు. అనంతరం ఎవరూ లేని సమయం చూసి ఏసీ కూపేలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని గుర్తించేందుకు రైల్వే పోలీసుల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..