Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. కొండపై బిగ్ క్యాంటీన్లు..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. కొండపై బిగ్ క్యాంటీన్లు..


తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో టీటీడీ బిగ్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో భక్తులకు త్వరతగతిన వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు నిర్వహకులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తాజాగా తిరుమలలో బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు.

నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలు

టీటీడీ పాలసీ ప్రకారం నిర్దేశించి ధరలకు మాత్రమే ఆహార పదార్థాలను భక్తులకు విక్రయించాలని నిర్వాహకులకు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. హోటల్ సిబ్బంది డ్రెస్‌కోడ్ పాటించడంతో పాటు సాంప్రదాయ వంటకాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. ఇక జనతా క్యాంటీన్ల నిర్వాహకులతో కూడా వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. నిబంధనల ప్రకారమే నిర్ణయించిన ధరలకు ఆహార పదార్థాలను విక్రయించాలని సూచించారు. ఇక హోటళ్లలో పారిశుద్ద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పరిశుభ్రత పాటించాలని అడిషనల్ ఈవో సూచించారు. అలాగే కాటేజీ డోనర్ స్కీమ్ ద్వారా విశ్రాంతి గృహలు నిర్మిస్తున్న దాతలతో భేటీ అయ్యారు. వీటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మే15వ తేదీలోపు గృహలను పూర్తి చేసి టీటీడీకి అప్పగించాలని పేర్కొన్నారు.

ప్రతి గృహంలో జనరేటర్

ప్రతి గృహంలో జనరేటర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. అటు టీటీడీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కుమార్తె, కుమార్తె రూ.10 లక్షల విరాళం అందించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరికి డీడీలను అందించారు. అటు తిరుమలలో మూడు రోజుల పాటు జరిగిన పరిణయ మహోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. కాగా వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే పెరిగింది. ఉచిత దర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతుంది. ఇక టైం స్లాటెడ్ సర్శదర్శనానికి 7 గంటల వరకు పడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *