సర్వరోగాలకు ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లే కారణం.. జస్ట్ ఈ నాలుగు తినండి.. మార్పు అస్సలు ఊహించలేరు..!

సర్వరోగాలకు ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లే కారణం.. జస్ట్ ఈ నాలుగు తినండి.. మార్పు అస్సలు ఊహించలేరు..!


Weight loss tips Telugu: ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం తీసుకునే ఆహారం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగడం (Sugar Spikes), ఆ తర్వాత పడిపోవడం వల్ల ప్యాంక్రియాస్ పైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది. మన పూర్వీకులు తిన్న ఆహారమే మనం తింటున్నామని అనుకుంటాం. కానీ, అప్పటి క్వాలిటీ ఇప్పుడు లేదు. అలాగే, మన ప్రస్తుత జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మైదా, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం పెరగడం వల్ల పోషకాలు లేని ‘డెడ్ క్యాలరీస్’ శరీరంలోకి చేరుతున్నాయి.

టిఫిన్ల వెనుక దాగున్న అసలు నిజం..

మనం అత్యంత ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఎలాంటి లోపాలు ఉన్నాయో ఓసారి చూద్దాం..

పూరీ: ఒక్క పూరీలో 150 నుంచి 200 క్యాలరీల వరకు ఉంటాయి. మూడు పూరీలు తింటే సుమారు 600 క్యాలరీలు శరీరంలోకి వెళ్తాయి. ఇందులో వాడే మైదా, వేడి చేసిన ఆయిల్ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతాయి.

వడ: రెండు వడలు తింటే 600 క్యాలరీలు వస్తాయి. ఇవి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాబట్టి వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు ఎయిర్ ఫ్రైయర్ వాడటం మంచి ప్రత్యామ్నాయం.

ఇడ్లీ: ఇడ్లీ ఆరోగ్యకరమే అయినా, అది కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే ఇస్తుంది. దీనిని ఫైబర్ ఉన్న వెజిటేబుల్ సాంబార్, ప్రోటీన్ ఉన్న చట్నీతో తింటేనే అది ‘బాలెన్స్డ్ డైట్’ అవుతుంది.

బ్రెడ్ జామ్, పోహా: బ్రెడ్ జామ్‌లో షుగర్, ప్రిజర్వేటివ్స్ తప్ప పోషకాలు ఉండవు. పోహా (అటుకులు) కూడా లైట్ ఫుడ్ అని అనుకుంటాం. కానీ, అందులోనూ ప్రోటీన్ తక్కువగా ఉండి నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది.

బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఐడియల్ డైట్ ప్లాన్..

మీ రోజును చక్కెరలతో కాకుండా ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్‌తో ప్రారంభించండి. దీనివల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.

నట్స్, సీడ్స్: ఉదయాన్నే నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌తో రోజును ప్రారంభించండి. నీటిలో చియా సీడ్స్ కలుపుకుని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి.

పెసరట్టు: దోస, ఇడ్లీ కంటే పెసరట్టు ఉత్తమమైనది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

మిల్లెట్స్: ఉప్మా చేసేటప్పుడు రవ్వకు బదులుగా కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలను వాడండి. అందులో ఎక్కువ కూరగాయలు వేయడం మర్చిపోకండి.

పండ్ల విషయంలో జాగ్రత్త: ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్‌లు తాగొద్దు. పండ్లను నేరుగా ముక్కలుగా కోసుకుని సాయంత్రం స్నాక్‌లా తీసుకోవడం మంచిది.

ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ప్లేట్‌లో పెట్టుకునే ప్రతి ముక్క మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. సరైన నిష్పత్తిలో ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకుంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

గమనిక: ఈ సమాచారం వీడియోలోని నిపుణుల సూచనల ఆధారంగా అందించాం. ఏదైనా డైట్ ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *