Headlines

ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. పెద్ద స్టార్ అనే గర్వం ఉండదు : రవిబాబు

ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. పెద్ద స్టార్ అనే గర్వం ఉండదు : రవిబాబు


ప్రముఖ నటుడు దర్శకుడు రవి బాబు త్వరలోనే రేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ.. తన కెరీర్, తోటి నటులతో అనుభవాలు, సినిమా పరిశ్రమలోని కొన్ని ధోరణులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి, అలాగే సినిమా ఆడియో లాంచ్‌ల పట్ల తనకున్న తీవ్ర వ్యతిరేకత గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మహేష్ బాబుతో కలిసి ‘మురారి’ చిత్రంలో పని చేసిన అనుభవం గురించి అడిగినప్పుడు, రవి బాబు మహేష్‌ను ప్రశంసించారు. చాలా కూల్ గా ఉంటాడు.. నాకు మహేష్ చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఎదురింట్లోనే ఉండేవాడు,” అని ఆయన గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు చాలా సరదాగా, నిరాడంబరంగా, క్యాజువల్‌గా ఉంటారని, “ఆ పెద్ద స్టార్ నేను” అనే వైఖరి ఆయనలో ఏమాత్రం కనిపించదని రవి బాబు వెల్లడించారు. ఆయన ఎప్పుడూ చాలా మామూలుగానే ఉంటారని, ఒక మంచి వ్యక్తిగా, మంచి మనిషిగా మహేష్‌ను ప్రశంసించారు రవిబాబు.

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

అలాగే ఆడియో లాంచ్‌లు లేదా ఇతర సినిమా ప్రచార కార్యక్రమాలకు తాను హాజరుకానని రవి బాబు తెలిపారు. వాటిని చాలా బోరింగ్‌గా, ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా భావిస్తానని పేర్కొన్నారు. తాను అసలు జన సమూహాల్లోకి వెళ్లే రకం కాదని, ఒక పెళ్లిలో 500 మంది ఉంటే భోజనం కూడా చేయకుండా వచ్చేస్తానని తన వ్యక్తిత్వాన్ని వివరించారు. ఆడియో లాంచ్‌లు తనను ఒక బందీగా కూర్చోబెట్టి, స్వీయ ప్రచార ప్రక్రియలా అనిపిస్తాయని రవి బాబు అభిప్రాయపడ్డారు. అక్కడ యాంకర్లు సోషల్ మీడియాలో వ్యక్తిని అనౌన్స్ చేయడం, వారి ఏవీలు ప్లే చేయడం వంటివి అసలు సంగీతానికి సంబంధించినవి కావని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

ఆడియో ఫంక్షన్లు సంగీతం గురించి జరగాలి కానీ, అక్కడ ఆడియో సిస్టమ్‌లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, డ్యాన్సర్‌లు వంటి వాటికే ప్రాధాన్యత ఉంటుందని, అది కేవలం ప్రచార కార్యక్రమంలాగే ఉంటుందని ఆయన విమర్శించారు. అందుకే తన సినిమాల ఆడియో ఫంక్షన్లకు కూడా తాను వెళ్లనని రవి బాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అసలు ఆడియో రిలీజ్ ఫంక్షన్లే ఉండకపోవచ్చని, అవి ఒక వృథా అని చాలా మంది భావిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పాట బాగుంటే దానంతట అదే ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, హడావిడి చేయాల్సిన అవసరం లేదని రవి బాబు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *