Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా  రూ.459 సరికొత్త ప్లాన్‌..!


ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. గేమర్లు, యువత కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘జియో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్’ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ధరను రూ.459గా నిర్ణయించారు. డేటాతో పాటు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే, రూ.459 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో వినియోగదారులకు మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున 56 జీబీ డేటాతో పాటు, అదనంగా మరో 5 జీబీ డేటా కూడా అందిస్తారు. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా జియో గేమ్స్, క్లౌడ్ గేమింగ్ యాక్సెస్‌ను మై జియో యాప్‌లో పొందవచ్చు. వీటితో పాటు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా, సుమారు రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తుండటం ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గేమింగ్, సోషల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను ఒకేచోట అందించడం ద్వారా యువత సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని జియో భావిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు

ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??

ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది

Kalyan Padala: హీరోగా కళ్యాణ్‌ పడాల.. మొదటి అడుగు పడింది

Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *