ఆర్మీ జవాన్ అంటూ.. బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.. అక్కడ జడ్జిలను ఇంప్రెస్ చేసి.. బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో మొదట తడబడిన ఈ జవాన్.. ఆ తర్వాత తన గేమ్‌ను సరిచేసుకుని.. హౌస్లో దూసుకుపోయాడు. ఎవ్వరికీ అందనంత ఓటింగ్‌తో.. ప్రతీ వారం తన గ్రాఫ్ పెంచుకుంటూ.. చివరికి సీజన్ 9 విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన క్రేజ్‌తో.. సినిమాల్లో రాణించాలని ఆశపడుతున్న కళ్యాణ్ పడాల.. ఇప్పుడు తన మొదటి అడుగు వేశాడు. ఓ మ్యూజిక్ వీడియోలో నటించాడు. ఇప్పుడా మ్యూజిక్ వీడియో ప్రోమో రిలీజ్ అయింది. ‘నిజమే రుజువైనది’ అంటూ సాగే ఈ మధురమైన సాంగ్‌లో… కళ్యాణ్ పడాలతో పాటు.. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 కంటెస్టెంట్ కమ్ మోడల్ వియానా నటించింది. జె.వి సుధాన్షు,వందన,సాత్విక్ కొండెపూడి ఈ మెలోడీ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌కు రైటర్,డైరెక్టర్,డీవోపీ కే ప్రకాశ్ రెడ్డి. ప్రస్తుతం ఈ మ్యూజిక్ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ పడాల వేసిన తన మొదటి అడుగు విజయవంతం అవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ
Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..
Varanasi: ‘వారణాసి’ స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ
వివాదంలో అనుష్క శర్మ.. చేతులతో అసభ్యకరమైన సైగలు.. ఫ్యాన్స్ ఆగ్రహం
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు