Headlines

Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ

Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు..  కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ


రాష్ట్రంలో కలకలం రేపుతున్న శుభాక్షేత్ర ఇన్ఫ్రా, మైక్రో ఫైనాన్స్ ఆర్థిక మోసాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సామాన్యుల కష్టార్జితాన్ని రెట్టింపు చేస్తామంటూ నమ్మించి కోట్ల రూపాయల మేర జరిగిన వసూళ్ల పర్వంలో ప్రముఖ గాయని మంగ్లీ పేరు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవైపు తనపై వస్తున్న ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఆమె ప్రమేయంపై గిరిజన విద్యార్థి సంఘాల నేతలు ఆధారాలతో సహా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేరుతో జరిగిన ఆర్థిక మోసాల కేసులో తనపై వస్తున్న ఆరోపణలకుగాను సింగర్ మంగ్లీ రియాక్టయ్యారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని దుష్ప్రచారంగా మంగ్లీ కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో బాధితులకు అన్యాయం జరిగిందని చెబుతూ… వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మోసం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన మంగ్లీ… కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజం తప్పకుండా బయటపడుతుందని, తాను చట్టాన్ని, న్యాయవ్యవస్థను సంపూర్ణంగా గౌరవిస్తానని తెలిపారు. ఇక, న్యాయ ప్రక్రియపై పూర్తి నమ్మకం ఉందని చెబుతూ… చట్టపరమైన మార్గంలోనే అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆమె చెప్పారు. మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో నడిచిన ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, భూములపై పెట్టుబడులు పెడితే త్వరగా రిటర్న్స్ వస్తాయని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, గ్రామీణ పెట్టుబడిదారులు లక్ష్యంగా చేసుకుని ఈ స్కీమ్ నడిపినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా లాభాలు, కొంత కాలానికి డబుల్ అవుతుందనే హామీలతో డబ్బులు సేకరించినట్టు సమాచారం. కొందరికి ప్రారంభంలో చిన్న మొత్తాలు తిరిగి ఇచ్చి నమ్మకం కల్పించి… తర్వాత పెద్ద మొత్తాలు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సంస్థ కార్యకలాపాలు మందగించడం, చెల్లింపులు ఆగిపోవడం వల్ల అనుమానాలు మొదలయ్యాయి. బాధితుల ప్రకారం, కోట్ల రూపాయల వరకు డబ్బులు ఈ వ్యవహారంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పలువురు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. ఈ కేసులో కొందరిపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యి విచారణ కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..

Varanasi: ‘వారణాసి’ స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ

వివాదంలో అనుష్క శ‌ర్మ.. చేతుల‌తో అసభ్యకరమైన సైగ‌లు.. ఫ్యాన్స్ ఆగ్రహం

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *