చికెన్ కూర వండమని అడిగినందుకు.. భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య!

చికెన్ కూర వండమని అడిగినందుకు.. భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య!


చికెన్ కూర వండమని అడిగినందుకు.. భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య!

కామారెడ్డి, ఏప్రిల్‌ 27: ఆదివారం ఓ భర్త నిండు ప్రాణం గాల్లో కలిగిసిపోయింది. నాన్‌వెజ్‌ కర్రీ వండలేదని దంపతుల మధ్య గొడవ జరిగడంతో.. ఆవేశంతో ఊగిపోయిన భార్య కొడవలితో భర్తపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె కటకటాల పాలయ్యింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ (30), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏడాది, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య వారంరోజులుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నాన్‌వెజ్‌ వండాలని శివాజీ కోరగా.. భార్య లక్ష్మి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో విచక్షణ కోల్పోయిన లక్ష్మి.. పక్కనే ఉన్న కొడవలి తీసుకుని భర్త శివాజీపై దాడి చేసింది.

ఈ దాడిలో శివాజీ గొంతు, మెడ భాగంలో లోతుగా గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై శివాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మృతి, తల్లి జైలు పాలవ్వడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *