Headlines

అబ్బాయి సినిమాకు బ్రేక్.. బాబాయ్ తో సినిమాకు సై…

అబ్బాయి సినిమాకు బ్రేక్.. బాబాయ్ తో సినిమాకు సై…


దేవర 2 పరిస్థితి ఏంటి..? సినిమా ఉంటుందా లేదా..? కచ్చితంగా ఉంటుందనే మేకర్స్ చెప్తున్నారు కానీ అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకవేళ దేవర 2 ఆగిపోతే.. కొరటాల నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు..? కొరటాల లిస్టులో ఉన్న హీరోలెవరు..? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి..? వీటన్నింటికీ సమాధానం దొరికేసింది. 400 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలోనే ఉంది. దేవర 2 ఉందని మేకర్స్ చెప్తున్నా.. అదేమంత ఈజీ కాదు. దేవర 2 సందిగ్ధంలో ఉన్న ఈ టైమ్‌లో ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా దాదాపు ఖరారైపోయింది.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఒక్కటే బ్యాలెన్స్. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ అయిపోయాయి. ఓవైపు గోపీచంద్ సినిమా చేస్తూనే.. మరోవైపు కొరటాల సినిమాని కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తరహాలోనే.. బాలయ్యతో మళ్లీ ఓల్డ్ స్కూల్‌కు వెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జూలైలోపే పూర్తి కానుంది.. ఆలోపు కొరటాల ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తెచ్చి.. ఆ తర్వాత పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేయనున్నారు నటసింహం. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మాత. దేవర 2 కొన్నాళ్లు పక్కనబెట్టి ఇకపై పూర్తి ఫోకస్ బాలయ్య సినిమాపైనే పెట్టబోతున్నారు కొరటాల శివ. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *