The Kerala Story 2 OTT: అఫీషియల్.. ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. ‘ది కేరళ స్టోరీ 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

The Kerala Story 2 OTT: అఫీషియల్.. ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. ‘ది కేరళ స్టోరీ 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న రీసెంట్ సినిమా ‘ది కేరళ స్టోరీ 2’. 2023లో అదా శర్మ లీడ్ రోల్ లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంట్రవర్సీ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లనే రాబట్టింది. కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య ఓజా, సుమిత్ గహ్లావత్, ఉల్కా గుప్తా, అదితి భాటియా, అల్‌కా అమిన్, అర్జన్ సింగ్ ఔజ్లా, యుక్తా ఖోస్లా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘ప్రతీ పరిపూర్ణమైన ప్రేమ కథ వెనుక ఓ పథకం ప్రకారం పన్నిన ఉచ్చు దాగి ఉంటుంది. దివ్య, నేహా, సురేఖల కలలు పీడకలగా మారిన ఆ క్షణాన్ని చూడండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.


ఇవి కూడా చదవండి

కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ది కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించారు. స్వతంత్ర భావాలు కలిగిన సురేఖ (ఉల్కా గుప్త), దివ్య (అదితి భాటియా), నేహా (ఐశ్వర్యా ఓజా). కేరళకు చెందిన సురేఖ యూపీఎస్సీకి సిద్ధమవుతూ ఉంటుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణించాలనేది దివ్య కోరిక. ఇక నేహా జావెలిన్ త్రో రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి పోటీలకు రెడీ అవుతుంటుంది. అయితే ఈ
ముగ్గురమ్మాయిలు పేరెంట్స్ మాట పెడచెవిన పెట్టి మరీ ప్రేమించిన వారితో వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే ఈ సినిమా స్టోరీ.

జీ5లో ది కేరళ స్టోరీ 2 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *