సరిహద్దుల్ని చెరిపేస్తున్న టాప్ హీరోయిన్లు

సరిహద్దుల్ని చెరిపేస్తున్న టాప్ హీరోయిన్లు


గిరిగీసుకుని కూర్చుంటే మజా ఏం ఉంటుంది? అప్పుడప్పుడూ సరిహద్దుల్ని చెరిపేస్తుండాలి. బార్డర్స్ క్రాస్‌ చేస్తుండాలి. సడన్‌ సర్‌ప్రైజ్‌లు ఇస్తుండాలి. స్వతహాగా థ్రిల్‌ ఫీలవ్వాలి. అప్పుడు కదా మజా… అని అనుకుంటున్నారు మన నాయికలు. అందుకే అనుకున్నది చేసేయడానికి ఏమాత్రం తటపటాయించడం లేదు… సాహసం చేస్తాం రా డింభకా అంటున్న మన నాయికల మీద కాస్త ఫోకస్‌ చేసేద్దాం వచ్చేయండి. కాస్త స్పెషల్‌గా కనిపించడానికి ఎప్పుడూ వెనకాడలేదు శ్రుతిహాసన్‌. సినిమాలో హీరోయిన్‌గా మాత్రమే చేస్తానని మడి కట్టుకుని కూర్చోలేదు. కూలీలో అక్క పాత్రలో చేయడానికి రెడీ అన్నారు. ఇప్పుడు ‘ ఆకాశంలో ఒక తార’ సినిమాలో స్పెషల్‌ రోల్‌కీ సై అన్నారు. ఆమె మాత్రమే కాదు, నయన్‌ కూడా ఈ విషయంలో కాస్త పట్టువిడుపులున్నట్టే ప్రవర్తిస్తున్నారు. రీసెంట్‌గా మన శంకరవరప్రసాద్‌గారుతో బంపర్‌ హిట్‌ అందుకున్న నయన్‌.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘టాక్సిక్‌’లో రాయ సిస్టర్‌ రోల్‌ గంగగా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మల్టిపుల్‌ హీరోయిన్స్ ఉన్న మూవీలో తాను చేయడం ఏంటనుకోలేదు లేడీ సూపర్‌స్టార్‌. తన కేరక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ని మాత్రమే కన్సిడర్‌ చేశారు. ఇదే పంథాని ఫాలో అవుతున్నారు రష్మిక దేవరకొండ. చేతి నిండా సినిమాలున్నా.. పుష్పరాజ్‌తో సెట్లో గడిపే అవకాశాన్ని మిస్‌ చేసుకోవాలనుకోవడం లేదు శ్రీవల్లి. రాకాలో కాస్త నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌లో రష్మిక యాక్ట్ చేశారన్నది వైరల్‌ న్యూస్‌. ఈ మూవీలోనే దీపిక కూడా స్పెషల్‌గా కనిపించనున్నారు. ఆ మాటకొస్తే కమర్షియల్‌ మూవీస్‌లో స్పెషల్‌ రోల్స్ చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు దీపిక. జన నాయగన్‌ సినిమాలో నటిస్తున్న ఇద్దరు నాయికలవీ కీ రోల్సే. పూజా హెగ్డే, మమిత బైజూ ఇద్దరి పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్‌గా పూజా హెగ్డేనే కనిపించినా మమిత బైజు రోల్‌ చాలా కీలకంగా ఉంటుంది. మమిత ఓ వైపు హీరోయిన్‌గా దూసుకుపోతున్న టైమ్‌లో ఈ తరహా పాత్రలో చేయడం సాహసమనే అభిప్రాయం వినిపిస్తోంది ఇండస్ట్రీలో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *