Headlines

Team India: ‘టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ నో ఎంట్రీ.. ఆ ఒక్క రీజన్‌తో గంభీర్ మొండిచేయి’

Team India: ‘టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ నో ఎంట్రీ.. ఆ ఒక్క రీజన్‌తో గంభీర్ మొండిచేయి’


Vaibhav Suryavanshi Ipl 2026 StatsImage Credit source: https://x.com/BalveerCL/statu

Vaibhav Suryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అతడే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ అరంగేట్రంలోనే శతకంతో విరుచుకుపడి, ప్రస్తుత సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ కుర్రాడి ఆటతీరు చూసి ప్రపంచ దిగ్గజాలే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు వైభవ్ ప్రతిభను కొనియాడుతూ, అతడి భారత జట్టు ఎంపికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే మేటి బౌలర్లను ఎదుర్కొంటూ, 236 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఒకానొక దశలో ఈ సీజన్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కూడా దక్కించుకోవడం అతడి నిలకడకు నిదర్శనం.

ప్రముఖ క్రీడా విశ్లేషణ కార్యక్రమంలో మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ వంటి దిగ్గజాలు వైభవ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మైఖేల్ వాన్ మాట్లాడుతూ, వైభవ్ గణాంకాలు అద్భుతమని, అతడిని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. “వైభవ్‌ను చూస్తుంటే పాఠశాలకు వెళ్లే వయస్సులా అనిపిస్తుంది, కానీ అతడు బంతిని బాదే తీరు వేరు” అని డేవిడ్ లాయిడ్ చమత్కరించగా, అలిస్టర్ కుక్ స్పందిస్తూ.. “అసలు విదేశీ పర్యటనలకు వెళ్లడానికి అతడికి పాస్‌పోర్ట్ ఉందా?” అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ప్రపంచ అత్యుత్తమ బౌలర్లుగా పేరున్న జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ వంటి వారిని వైభవ్ ఎదుర్కొన్న తీరును అలెక్స్ హార్ట్లీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. బుమ్రా వేసిన వేగవంతమైన బంతిని అలవోకగా సిక్సర్‌గా మలచడం అతడి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని వాన్ పేర్కొన్నాడు. జట్టులోని మరో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను సైతం వైభవ్ తన బ్యాటింగ్‌తో వెనక్కి నెట్టేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ముగిసిన వెంటనే జరగనున్న ఐర్లాండ్ పర్యటనకు వైభవ్‌ను ఎంపిక చేయాలని వాన్ గట్టిగా వాదించాడు. ఒకవేళ తాను సెలెక్టర్‌గా ఉంటే, ఈ వేసవిలో ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేసేవాడినని ధీమా వ్యక్తం చేశాడు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిభకు పట్టం కట్టాలని వారు అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *