జేడీ చక్రవర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, ప్రముఖులతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ , జయసుధ, కమల్ హాసన్, వాణీశ్రీ, కె. రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ వంటి సినీ ప్రముఖులతో తన జ్ఞాపకాలను ఆయన తెలియజేశారు. జేడీ చక్రవర్తి ఒక చిత్ర నిర్మాణ సందర్భంలో జయసుధ గారితో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆయన ప్రతిరోజూ జయసుధకు 50సార్లు “ఐ లవ్ యూ సుధా” అని చెప్పేవారట. ఆమె తన తల్లితరం హీరోయిన్ అయినప్పటికీ, ఆయన ఈ విధంగా సంబోధించేవారని తెలిపారు. ఒకరోజు జయసుధ తనను “నీ నెంబర్ ఏమన్నా 7 ఆ చక్రి” అని అడిగారని, దానికి తాను “యస్, 7 వాళ్లని ప్రేమిస్తే 7 నా నెంబర్” అని చెప్పినట్లు చక్రవర్తి పేర్కొన్నారు. తన పుట్టినరోజు ఏప్రిల్ 16 అని చెప్పగా, జయసుధ “దొంగ నా కొడుకుల నెంబర్లు అన్ని 7లే” అని అన్నారట, అంటే ఎవరండీ అని చక్రి అడగ్గానే.. రాము (రామ్ గోపాల్ వర్మ), కమల్ హాసన్, కూడా ఇదే విధంగా చెప్పేవారని ఆమె అన్నారని జేడీ చక్రవర్తి తెలిపారు.
ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ
బాంబే ప్రియుడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను జేడీ చక్రవర్తి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో గులాబీ, అనగనగా ఒక రోజు వంటి విజయవంతమైన చిత్రాలతో ఆయన కొత్త హీరోగా కొనసాగుతున్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు వాణీశ్రీ గారు మొదటిసారి సెట్‌కు వచ్చారు. ఆమెను కె. రాఘవేంద్రరావు జేడీ చక్రవర్తికి పరిచయం చేయగా, జేడీ చక్రవర్తి హాయ్ వాణి అని సంబోధించారట. దీనికి వాణీశ్రీ అభ్యంతరం వ్యక్తం చేసి, రాఘవేంద్రరావు గారి పక్కన వెళ్లి నిలబడ్డారని తెలిపారు.
ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
రాఘవేంద్రరావు జేడీ చక్రవర్తిని మందలించగా, తాను జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాన్ని చూసి ఆమెను ఫిలాసఫర్ అనుకున్నానని, అందుకే అలా సంబోధించానని వివరించారు. రాఘవేంద్రరావు సూచన మేరకు వాణీశ్రీకి క్షమాపణ చెప్పడానికి జేడీ చక్రవర్తి వెళ్లారట. దాదాపు 30 నిమిషాల పాటు వాణీశ్రీ గారితో మాట్లాడిన తర్వాత, ఆమె బయటికి వచ్చారు. ఆ సంభాషణలో తాను అన్నీ బెసెంట్ కొటేషన్స్‌తో పాటు “ఐ థాట్ ద సోల్ డజంట్ హ్యావ్ ఎ నేమ్” వంటి కొటేషన్స్‌ను ఉపయోగించానని, వాటితో ఆమెను మెప్పించగలిగానని జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సంభాషణలో తాను ఏం చెప్పింది ఇప్పటికీ కె. రాఘవేంద్రరావు గారికి కూడా మిస్టరీగా మిగిలిపోయిందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి