Rakasa OTT: సంగీత్ శోభన్.. రాకాస OTT అప్డేట్ !!

Rakasa OTT: సంగీత్ శోభన్.. రాకాస OTT అప్డేట్ !!


యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. లేడీ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 03న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి తోడు నిహారికతో పాటు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేయడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఫాంటసీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు మూడు వారాలవుతోంది. ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లలో ఆడుతున్నప్పటికీ… ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరి కోరిక నెరవేరనుంది. ఈ మూవీ ఓటీటీ పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రాకాస సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ చేసుకుంది. ఈ మేరకు థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలనే అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రాకాస మూవీ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే రెండో వారంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chalaki Chanti: నా తర్వాత వచ్చిన సుడిగాలి స్టార్ అయ్యాడు !! కానీ నేను..

Assi Movie Review: మంచి కోర్టు రూమ్ డ్రామా..18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ

TOP 9 ET News: 80కోట్ల ఇంద్రభవనం రెడీ.. గృహప్రవేశమే తరువాయి?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *