చూయింగ్‌ గమ్ నములుతున్నారా? ఈ సమస్యలు వస్తాయని తెలిస్తే జీవితంలో తినరు

చూయింగ్‌ గమ్ నములుతున్నారా? ఈ సమస్యలు వస్తాయని తెలిస్తే జీవితంలో తినరు


చూయింగ్‌ గమ్ నములుతున్నారా? ఈ సమస్యలు వస్తాయని తెలిస్తే జీవితంలో తినరు

మైక్రోప్లాస్టిక్స్ అంటే కంటికి కనిపించనంత చిన్న ప్లాస్టిక్ కణాలు. కొన్ని చ్యూయింగ్ గమ్‌లలో ఉపయోగించే ‘గమ్ బేస్’ అనే పదార్థం సింథటిక్ పాలిమర్స్‌తో తయారవుతుంది. దీనిని గంటల తరబడి నమలడం వల్ల అవి సూక్ష్మ కణాలుగా విడిపోయి పొట్టలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రతిరోజూ చ్యూయింగ్ గమ్ నమలడం వల్ల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరుతాయని, అవి పురుషులలో సంతానలేమి సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి ఎలా వెళ్తాయి?

సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం

సంతానోత్పత్తిపై మైక్రోప్లాస్టిక్స్ చూపే ప్రభావం గురించి ఇటీవల జరిగిన అధ్యయనాలు విస్తుపోయే నిజాలను వెల్లడించాయి. 2024లో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో చేసిన పరిశోధనలో మానవ వృషణ కణజాలంలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే 2025లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ నివేదిక ప్రకారం, సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న పురుషులలో 55 శాతం మంది నమూనాలలో ఈ ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. ఇవి శరీరంలో చేరినప్పుడు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ముఖ్యంగా టెస్టోస్టెరోన్ స్థాయిలను తగ్గించి, స్పెర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఇది ఫెర్టిలిటీ సమస్యలకు ప్రధాన కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సూచనలు

చ్యూయింగ్ గమ్ వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. సాధారణ సింథటిక్ గమ్‌లకు బదులుగా సహజమైన లేదా ప్లాంట్-బేస్డ్ (మొక్కల ఆధారిత) గమ్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని కూడా పరిమితంగానే నమలడం మంచిది. కేవలం గమ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ కంటైనర్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ పాత్రలను వాడటం ఉత్తమం. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చు.

తల్లిదండ్రులు కావాలని ప్లాన్ చేసుకునే వారు ఇలాంటి చిన్నపాటి అలవాట్లపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మనకు సాధారణంగా అనిపించే అలవాట్లు మన ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, సహజ సిద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *