సిక్సర్లతో అభిషేక్ ఖతర్నాక్ రికార్డ్.. కట్‌చేస్తే.. 24 గంటల్లోనే బిగ్ షాక్ తగలనుందా..?

సిక్సర్లతో అభిషేక్ ఖతర్నాక్ రికార్డ్.. కట్‌చేస్తే.. 24 గంటల్లోనే బిగ్ షాక్ తగలనుందా..?


Abhishek Sharma Century vs DC: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాట్‌తో విస్ఫోటనం సృష్టించాడు. సీజన్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాత అభిషేక్‌ను తలపించాడు. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో అతను ఆడిన తీరు అద్భుతం. కేవలం మొదటి 6 ఓవర్లలోనే 3 భారీ సిక్సర్లు బాదడం ద్వారా ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం అభిషేక్ శర్మ 7 ఇన్నింగ్స్‌లలో పవర్ ప్లేలో మొత్తం 18 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ యువ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ పేరిట ఉండేది. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అభిషేక్ సాధించిన ఈ ఘనత అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

వైభవ్ సూర్యవంశీ సవాల్: 24 గంటల్లో మళ్ళీ నంబర్-1?

అభిషేక్ శర్మ ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఈ సంతోషం ఎంతో కాలం నిలిచేలా లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ, 6 ఇన్నింగ్స్‌లలో 17 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ 22న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనున్న పోరులో వైభవ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ గనుక రెండు సిక్సర్లు బాదితే, మళ్ళీ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. ఈ ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్ల మధ్య జరుగుతున్న ఈ సిక్సర్ల యుద్ధం టోర్నీకే హైలైట్‌గా నిలుస్తోంది.

ఢిల్లీపై అభిషేక్ విశ్వరూపం: 135 పరుగుల అజేయ శతకం..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లోనే తన కెరీర్‌లో రెండో ఐపీఎల్ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 68 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు భారీ స్కోరు అందించడం విశేషం. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా 13 బంతుల్లో 37 పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *